- ఫెర్నాండెజ్ హాస్పిటల్ లో నిర్వహణ
- డాక్టర్ తారకేశ్వరి సురపనేని
ప్రతి సంవత్సరం ఏప్రిల్ 11న జరుపుకునే జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం సందర్భంగా… గర్భధారణ, ప్రసవ సమయంలో ప్రతి మహిళ సురక్షితమైన, గౌరవప్రదమైన ప్రయాణాన్ని అనుభవించేలా సహకారం అందించడంలో ఫెర్నాండెజ్ హాస్పిటల్ తన నిబద్ధతను పునరుద్ఘాటించింది.
ఈ సందర్భంగా ఫెర్నాండెజ్ హాస్పిటల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ తారకేశ్వరి సురపనేని మాట్లాడుతూ., తల్లి సంరక్షణ, సురక్షిత మాతృత్వం అనేది కేవలం ప్రసవం వరకే పరిమితం కాదని నొక్కి చెప్పారు. “సురక్షిత మాతృత్వం అంటే కేవలం ప్రసవం మాత్రమే కాదు… అది మహిళల ప్రయాణంలోని ప్రతి దశలోనూ వారికి అండగా నిలవడం. ఫెర్నాండెజ్లో, ఈ సంరక్షణ గర్భధారణకు ముందే ప్రారంభమవుతుంది. గర్భధారణకు ముందు ఇచ్చే కౌన్సెలింగ్ ద్వారా మహిళలు ఆరోగ్యకరమైన ప్రసవానికి సిద్ధపడటానికి సహాయపడుతుంది,” అని ఆమె అన్నారు.
ప్రసవం తర్వాత తల్లుల సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను డాక్టర్ తారకేశ్వరి ప్రత్యేకంగా వెల్లడించారు… “మా బాధ్యత డెలివరీతో పూర్తవదు… తల్లుల కోసం ప్రత్యేక క్లినిక్లతో సహా ప్రసవానంతర మద్దతు, వారి దీర్ఘకాలిక ఆరోగ్యం, శ్రేయస్సును నిర్ధారించడంలో ఒక ముఖ్యమైన భాగం” అని పేర్కొన్నారు.
