Friday, February 27, 2026
Homeకరీంనగర్Road Safety | రెండవ రోజు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు

Road Safety | రెండవ రోజు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు

కరీంనగర్ జిల్లా ఉప రవాణాశాఖ అధికారి పి.పురుషోత్తం ప్రత్యక్ష పర్యవేక్షణ లో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు 2026 కు సంబంధించిన రెండవ రోజు కార్యక్రమం కరీం నగర్ పట్టణ బస్ స్టాండ్ చౌరస్తాలో జరిగినది. ఈ కార్య కార్యక్రమం లో భాగం గా ఏభై వాహనాల ను తనిఖీ చేయగా అందులో, 35 కార్ల డ్రైవర్లు సీట్ బెల్ట్ లను ధరించకపోవడం గమనార్హం. కారు ప్రమాదాల్లో సీటు బెల్ట్ ధరించనందుననే అధిక శాతం మంది డ్రైవర్లు మరణిస్తున్నందున వాహనాల డ్రైవర్ల కు సీటు బెల్టు ధరించడం పై అవగాహన కలిగించడం తో పాటు పువ్వుల ను ఇచ్చి చైతన్య పరచడం జరిగింది.

ఈ కార్యక్రమం లో డి.టి.ఓ శ్రీకాంత్ చక్ర వర్తి, యమ్.వి.ఐ రవికుమార్, ఏ.యమ్.వి.ఐ హరిత లతో పాటు రక్షణ రోడ్ సేఫ్టీ ఫౌండేషన్ కోఆర్డినేటర్ డాక్టర్ నీలం సంపత్ రవాణాశాఖ సిబ్బంది మరియు ట్రాఫిక్ పోలీస్ యస్.ఐ .ఆఫ్ పోలీస్ ప్రసాద్, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News