Wednesday, March 4, 2026
Homeవరంగల్‌Renewal | నర్సంపేట ప్రైవేట్ ఆస్పత్రుల రెన్యువల్ చేయరా సార్లు

Renewal | నర్సంపేట ప్రైవేట్ ఆస్పత్రుల రెన్యువల్ చేయరా సార్లు

నర్సంపేట పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రుల రెన్యువల్ చేసి సీఎంఆర్ఎఫ్ బాధితులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్, ఎమ్మార్పీఎస్ కట్ల రాజశేఖర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు దిడ్డి పార్థసారధి, పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు అజయ్, బి ఆర్ ఎస్ వి డివిజన్ కన్వీనర్ సదిరం వినయ్ మాట్లాడుతూ…

నర్సంపేట డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు ఇటీవల కాలంలో అనారోగ్యానికి గురై నర్సంపేట వివిధ హాస్పటల్లో అడ్మిషన్ పొంది ట్రీట్మెంట్ తీసుకోగా అట్టి బాధితులు గత తొమ్మిది నెలల నుండి సీఎంఆర్ఎఫ్ నిధులు దరఖాస్తు చేసుకోక సంబంధిత హాస్పటల్ రెన్యువల్ కాకపోవడంతో సీఎంఆర్ఎఫ్ చెక్కులు రిజెక్ట్ కావడం జరుగుతుందని తెలిపారు. ఇట్టి విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించి నర్సంపేట పట్టణంలోని అర్హత ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులకు రెన్యువల్ కోసం అవకాశం కల్పించి సీఎంఆర్ఎఫ్ బాధితులకు న్యాయం చేయాల్సిందిగా కలెక్టర్ కోరినట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News