Wednesday, March 18, 2026
Homeవరంగల్‌Narsampet | నర్సంపేట మున్సిపాలిటీలో పైసలు లేవు..

Narsampet | నర్సంపేట మున్సిపాలిటీలో పైసలు లేవు..

  • రెండు నెలలుగా కార్మికులకు జీతాలు లేవు..
  • ఉగాది రంజాన్ పండుగలకు పసందు లేదు..
  • మౌనంగా రోదిస్తున్న మున్సిపాలిటీ కార్మికులు..
  • పన్నుల వసూలు తోటే కార్మికులకు వేతనాలు

నర్సంపేట మున్సిపాలిటీ ట్రెజరీ ఖాతాలో డబ్బులు లేకపోవడంతో మున్సిపాలిటీ పరిధిలో పనిచేసే సుమారు 180 మంది వివిధ రకాలైన కార్మికులు పండుగ కు పస్తులు ఉండాల్సిన పరిస్థితి దాపురించింది. జనవరి, ఫిబ్రవరి నెల జీతాలు లేకపోవడంతో ఈ మార్చి నెలలో ఉగాది పండుగ తో పాటు రంజాన్ పండుగలు వెను వెంటనే రావడంతో పండుగ పూట పసందు లేకుండా పోతుందని కార్మికులు మౌనంగా రోహిస్తున్నారు. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులు ఉండగా సుమారు విలీన గ్రామాలల్లో పనిచేసే కార్మికులతో పాటు మొత్తం 220 మంది పారిశుద్ధ్య, హరితహారం, ప్లాంటేషన్, ఎలక్ట్రిషన్, వాటర్, డ్రైనేజీ తదితర విభాగాల్లో పనిచేసే కార్మికులు ఉన్నారు.

కాగా జనవరి నెల జీతాలు కార్మికుల కు వేశామని మున్సిపాలిటీ అధికారులు చెబుతున్నప్పటికీ అవి జమ కాకపోవడంతో ఫిబ్రవరిలో కూడా అదే సంఘటన జరిగితే ఇబ్బంది పడాల్సి వస్తుందని ఉద్దేశంతో మున్సిపాలిటీ అధికారులు కార్మికుల వేతనాలను ట్రెజరీ కార్యాలయానికి రాయకుండా చేశారు. దీంతో మొత్తంగా రెండు నెలల వేతనాలు కార్మికులకు బాకీ ఉన్నాయి. కాగా వేతనాలు ఇవ్వండి మహాప్రభువు అని మౌనంగా రోదించడం తప్ప కార్మికులు చేసేది ఏమీ లేకుండా పోయింది. వేతనాల కోసం అడిగితే మున్సిపాలిటీ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. ఈ విషయంపై నర్సంపేట మున్సిపాలిటీ కమిషనర్ కాటం భాస్కర్ ను ఫోన్ లైన్ లో వివరణ కోరగా స్పందించలేదు.

- Advertisement -

అదేవిధంగా మున్సిపాలిటీ అకౌంటెంట్ రజిని ని వివరణ కోరగా జనవరిలో ట్రెజరీ ద్వారా వేతనాలు రాకపోవడంతో ఫిబ్రవరి మాసపు వేతనాలు ట్రెజరీకి అందివ్వలేదని ఇటీవల గత వారం రోజుల నుండి నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో వసూలు చేస్తున్న ఇంటి టాక్స్ డబ్బులను దఫ దఫాలుగా కార్మికుల వేతనాలుగా ఇచ్చేందుకు 15 గ్రూపులకు ఒక నెల వేతనాలు వారి వారి గ్రూపు ఖాతాలో వేసామని రజిని స్పష్టం చేసింది. ఇంకా మిగిలిన వారికి టాక్సీలు కలెక్షన్ చేశాక కార్మికులకు వేతనాలు అందిస్తామని పండుగకు వేతనాలు అందివ్వాలని తపన మాకు ఉన్న అందివ్వలేని స్థితిలో ఉన్నామని రజిని పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News