Sunday, April 12, 2026
Homeవరంగల్‌Narsampet | 10:30 దాటిన తెరుచుకొని ఎంపిడిఓ కార్యాలయం..

Narsampet | 10:30 దాటిన తెరుచుకొని ఎంపిడిఓ కార్యాలయం..

  • అంతా ఎన్నికల్లో అలసిపోయారని ఎంపీడీవో వివరణ

అసలే కొత్త సర్పంచులు కొలువుదీరిన వేళలో వివిధ పనుల కోసం సర్పంచులు ఎంపీడీవో కార్యాలయం చేరుకోవడం ఆనవాయితీగా మారుతుంది. వివిధ వివిధ అభివృద్ధి పనుల కోసం ఎంపీడీవో కార్యాలయమే కేంద్రీకృతమై ఉండగా వరంగల్ జిల్లా నర్సంపేట మండల ఎంపీడీవో కార్యాలయం 10:30 దాటినప్పటికీ తెరుచుకోకపోవడంతో పలు విమర్శలకు తావిస్తోంది.

పంచాయతీ కార్యదర్శులు సిబ్బంది కార్యాలయం చేరుకున్నప్పటికీ కార్యాలయం తెరిచి ఉండకపోవడంతో సిబ్బంది అసహనానికి గురి కావాల్సి వస్తుంది. ఈ సంఘటనపై నర్సంపేట ఎంపీడీవో శ్రీనివాసరావును వివరణ కోరగా ప్రస్తుతం నేను లోకల్ టూర్ లో ఉన్నానని, అటెండర్ కార్యాలయం శుభ్రం చేసి గొల్లం వేసి వెళ్ళాడని కార్యాలయ సిబ్బంది మొత్తం ఎన్నికల్లో అలసిపోయి ఉన్నారని తద్వారా కార్యాలయానికి ఆలస్యం జరుగుతుందని వివరించడం కొసమెరుపుగా మారింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News