Monday, April 13, 2026
Homeవరంగల్‌Narsampet | దళితుడికి అవమానం….

Narsampet | దళితుడికి అవమానం….

  • నాలుగేళ్ల కింద ఇంటి నిర్మాణం…
  • ఇంట్లోకి వెళ్ళనివ్వకుండా గేటుకు అడ్డంగా ఇటుకలు పేర్చిన వైనం…
  • నోటిస్ ఇచ్చిన కమిషనర్… బతుకుదెరువు లేదంటున్న దళిత కుటుంబం

ఓ వ్యక్తి వద్ద ఇంటి ప్లాట్ ను కొనుగోలు చేసి ఇల్లు నిర్మాణం ప్రారంభించుకొని ఇంటి నెంబర్ తో సహా మున్సిపాలిటీ వద్దనుండే తీసుకొని ఇంటి నిర్మాణం పూర్తయ్యాక గృహప్రవేశం సైతం చేశాక ప్రహరీ గోడ గేటు నిర్మాణం చేస్తున్న క్రమంలో పక్కింటి వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో నాలుగేళ్లుగా ఆ ఇంటికి వెళ్ళనివ్వకుండా గేటుకు అడ్డంగా ఇటుకలు పేర్చి పాత దర్వాజాలు కిటికీలు తలుపులు వేయించి గృహం లోపటికి వెళ్లకుండా అడ్డుకోవడంతో కమిషనర్ కు, కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్లు పట్టుకొచ్చిన మున్సిపాలిటీ అధికారులు సైతం పర్మిషన్ ఉన్నాక సెట్ బ్యాక్ కాలేదంటూ నోటీసులు ఇచ్చి దళిత కుటుంబానికి జీవనోపాధి లేకుండా వారు సక్రమంగా జీవనం సాగించకుండా అడ్డుకుంటున్న వైనం నర్సంపేట మున్సిపాలిటీ హరిజన స్కూల్ పక్క సందులో జరుగుతుంది.

నర్సంపేటలో ఎలాంటి పర్మిషన్ లేకున్నప్పటికీ అమ్మెమ్యాలు తడిపితే ప్రభుత్వ భూమి నైనా ఆక్రమించేటట్లు అధికారులు ఊతమిస్తూ అక్కడ అక్రమ నిర్మాణాలకు పర్మిషన్ ఇస్తూ కొంతమంది అక్రమ నిర్మాణాలు చేసుకుంటుంటే చేతులు కట్టుకొని చూసుకుంటూ వెళుతున్న తరుణంలో పర్మిషన్ ఉన్నాక సైతం ఇల్లు నిర్మించుకున్నాక ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్న అధికారుల తీరును చూస్తే పట్టణవాసులు ఆశ్చర్యానికి గురికాక తప్పదు. నర్సంపేట పట్టణం పరిధిలోని శివాజీ నగర్ హరిజనవాడ స్కూల్ ప్రక్కనే గద్దె ఎల్లయ్య అను వ్యక్తి గద్దె సారంగం వద్ద నుండి 2021లో ఇండ్ల ప్లాటును కొనుగోలు చేసి మున్సిపాలిటీ అధికారుల వద్ద 12-6 అను ఇంటి నెంబర్లో నూతన గృహాన్ని నిర్మించుకున్నాడు.

- Advertisement -

వృద్ధాప్యానికి విచ్చేసిన ఎల్లయ్య కొత్త ఇంటిలో ప్రశాంతంగా జీవనం సాగిద్దామనుకున్న తరుణంలో గృహప్రవేశం చేశాక తన పరిధిలోనే ప్రహరీ గోడ, గేటు నిర్మాణం చేస్తున్న క్రమంలో పక్కింటి వ్యక్తులు గేటు నిర్మాణం చేయకుండా అడ్డుకొని మాది భూమి అంటూ ప్రభుత్వ సిసి రోడ్డు పైన ఎల్లయ్య ఇంటికి అమర్చుకునే గేటు ఎదురుగా ఇటుకలను పేర్చి ఇంకా ఇతరత్రా కట్టెలను అమర్చి ఎల్లయ్య ఇంటిలోనికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు.

ఈ క్రమంలో ఎల్లయ్య మున్సిపాలిటీ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన కోర్టుకు వెళ్లి స్టే తెచ్చినప్పటికీ ఇవేమీ చెల్లవు అని నర్సంపేట మున్సిపాలిటీ చట్టం ప్రకారం 30 ఫీట్ల బాట ఉండాల్సిందేనని ఎల్లయ్య వెళ్లే ఇంటి వద్దకు వచ్చు ప్రధాన రహదారి 12 ఫీట్లు అయినప్పటికీ ఎల్లయ్య ఇంటి వద్ద 30 ఫీట్ల దారి చూపించాల్సిందేనని సెట్ బ్యాక్ కాకుండా ఇల్లు నిర్మాణం ప్రహరి గోడ నిర్మాణం చేశావని ఉల్టా నోటీసులు ఇచ్చిన సంగతి తెలుసుకొని ఎల్లయ్య కుటుంబీకులు తీవ్రమనస్థాపం చెందుతూ దీర్ఘకాలిక రోగాలైన బిపి షుగర్ బారిన పడి అనారోగ్య పరిస్థితులలో కుమిలిపోతున్నారు.

30 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించుకున్నామని మాకు జీవించే హక్కు లేదా అని ఆ దళిత వృద్ధులు సమాజాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎనక ముందు ఎవరు లేకపోవడంతో మా జీవన సంసారాన్ని కాల రాస్తున్నారని లక్షలు పోసి ఇల్లు నిర్మించుకున్నాక ఇంట్లో స్వేచ్ఛగా బతకలేని స్థితిని కల్పించిన ఈ సమాజానికి చేతులెత్తి మొక్కుతున్నామని ప్రశాంతంగా వృద్ధాప్య జీవనాన్ని గడిపే మాకు సమాజం సహకరించాలని దానికి విరుద్ధంగా మమ్మల్ని చావుకు దగ్గరగా చేస్తున్నారని గద్దె ఎల్లయ్య అతని భార్య సరోజన వాపోతున్నారు. ఇల్లు టెన్షన్ తోనే మా జీవనంలో పెద్ద పెద్ద రోగాలు దరిచేరుతున్నాయని ఉన్నతాధికారులు స్పందించి మా ఇంటికి మమ్ముల వెళ్ళనివ్వాలని వారు వేడుకుంటున్నారు. రాజకీయ నాయకులు అధికారులు మాకు జీవనాన్ని ప్రసాదించాలని వృద్ధ దంపతులు వేడుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News