- పెద్ద మనుషులు గేట్లు పాతితే అమ్మినవారు పీకిస్తాండ్రు…
- అడగపోతే కొట్టిండ్రు…కేసుల పాలు చేసిర్రు… కన్నీరు పర్యంతమవుతున్న వికలాంగ గిరిజనుడు
నర్సంపేట: భూములు కొన్న పాపానికి గెట్టు రౌతులు పీకేయడంతో పాటు పెద్దమనుషుల సమక్షంలో మళ్లీ గెట్టు రైతులు పాతుకుంటే పెద్ద మనుషుల ముందే గెట్టు రౌతులు పీకేసి ఎందుకు పీకేసినవని అడగపోతే విచక్షణ రహితంగా వికలాంగుల అనేది మరిచిపోయి దాడి చేయడమే కాకుండా అంగ బలం అర్థబలంతో కేసులో పాలు చేశాడని నర్సంపేట మండలానికి చెందిన ముత్యాలమ్మ తండా శివారులోని జంగాలపల్లి తండా వికలాంగ గిరిజనుడు భూక్య బాలు ఆవేదన వ్యక్తం చేశాడు.
బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం నర్సంపేట మండలంలోని ముత్యాలమ్మ తండా శివారులోని జంగాలపల్లి తండాలో లాకావత్ ఫుల్ సింగ్ వద్ద నుండి భూక్య బాలు అను గిరిజన రైతు 2007 సంవత్సరంలో ఒక ఎకరం ఎనిమిది గుoటల భూమిని ఖరీదు చేసి పహానిపై రాసుకొని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
ఇటీవల ఇదే సంవత్సరం జూలై నెలలో అమ్మిన భూమిలో భూమి ఎక్కువగా ఉన్నదని నాడు అమ్మిన వ్యక్తి పంచాయతీ పెట్టి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లగా ఎస్సై సూచనల మేరకు పెద్ద మనుషుల సమక్షంలో రెండు మార్లు కొలతలు కొలిపించి తక్కువగా ఉన్న రెండు గుంటల చిల్లర భూమిని నాకు కలిపేందుకు పెద్దమనుషులు రెండు మార్లు గేట్లు ఖరారు చేసి పాతివ్వగా రెండు మార్లు పీకేసి నన్ను మనోవేదనకు గురి చేస్తున్నారని బాలు వాపోయాడు.
దారిపై వెళ్తున్న క్రమంలో గెట్టు రౌతులు ఎందుకు పీకేసావ్ అని అడగగా ఇంటింటి రాజులు మొత్తo మూకుమ్మడి దాడి చేసి నన్ను గాయాల పాలు చేసి ముందస్తుగానే వెళ్లి ఆ పై కేసులు పెట్టి జైలు పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని జిల్లా ఉన్నతాధికారులు వికలాంగుడి అయినా నాకు తగిన న్యాయం చేయాలని ఈ భూ పంచాయతీకి మొత్తానికి సూత్రధారులు ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడని కొన్ని ఎళ్లుగా మా వెంటపడి నాన ఇబ్బందులకు గురిచేస్తున్నాడని అతనిపై సైతం జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని బాలు కోరుతున్నాడు.
