Friday, February 13, 2026
Homeవరంగల్‌ACP | చెన్నారావుపేట పోలీస్ స్టేషన్‌ నీ తనిఖీ చేసిన నర్సంపేట ఏసిపి

ACP | చెన్నారావుపేట పోలీస్ స్టేషన్‌ నీ తనిఖీ చేసిన నర్సంపేట ఏసిపి

  • ఎస్సై మరియు సిబ్బందిపై ప్రశంసల జల్లు.

చెన్నారావుపేట పోలీస్ స్టేషన్‌ను మంగళవారం నర్సంపేట ఏసిపి పి.రవీందర్ రెడ్డి తనిఖీ చేశారు.ఈ సందర్భంగా స్టేషన్ నిర్వహణ, రికార్డుల నమోదు మరియు శాంతి భద్రతల పరిరక్షణలో సిబ్బంది తీరును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.మూడు సంవత్సరాలకు సంబంధించిన కేసుల గురించి ఆరా తీసి, పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీలు, కేడీలు వారు ప్రస్తుతం చేస్తున్న కార్యకలాపాల గురించి తెలుసుకొని,నేరాలు నిరోధించాలని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఎటువంటి అసాంఘిక చర్యలు జరగకుండా చూడాలని శాంతి భద్రతలు కాపాడాలని తెలిపారు. తనిఖీల్లో భాగంగా స్టేషన్‌లోని క్రైమ్ రికార్డులు,రిజిస్టర్లు తనిఖీ చేసి,పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను ఎసిపి తెలుసుకున్నారు.ప్రతి అంశాన్ని పక్కాగా రికార్డు చేయడంలో ఎస్.ఐ చూపిస్తున్న చొరవను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

తనిఖీ అనంతరం ఏసిపి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ చెన్నారావుపేట ఎస్సై మరియు పోలీస్ సిబ్బంది అత్యంత క్రమ శిక్షణతో, సమన్వయంతో పని చేస్తున్నారని కొనియాడారు. మండలంలో నేరాల అదుపునకు సిబ్బంది పడుతున్న శ్రమను కొనియాడారు.అనంతరం ఆయన సిబ్బందితో మాట్లాడుతూ ఇదే ఉత్సాహంతో పని చేస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని సూచించారు.బాధితులకు తక్షణ న్యాయం అందించడమే పోలీసుల ప్రథమ కర్తవ్యమని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో నెక్కొండ సిఐ శ్రీనివాస్,ఎస్ఐ రాజేష్ రెడ్డి, ఏఎస్ఐ లక్షణామూర్తి,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News