హీరో శర్వానంద్ సంక్రాంతి పండగ(Sankranti Festival) సందర్భంగా నారి నారి నడుమ మురారి(Nari Nari Naduma Murari) మూవీతో అలరించబోతున్నాడు. ఈ చిత్రం ఈ నెల 14న విడుదలవుతోంది. రామ్ అబ్బరాజు(Ram Abbaraju) దర్శకత్వం(Direction) వహించిన ఈ సినిమా టీజర్, మొదటి రెండు పాటలు భారీ అంచనాలను పెంచాయి. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్(Trailer Release) అయింది.
శర్వానంద్ రెండు డిఫరెంట్ టైమ్‌లైన్లలో, రెండు ప్రేమకథల్లో రెండు స్టైలిష్ లుక్స్‌లో కనిపిస్తాడు. హీరోయిన్ సాక్షి వైద్య(Heroine Sakshi Vaidya) తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు. మరో కథనాయకి సంయుక్త(Samyukta).. కథకు మరింత స్పైస్ యాడ్ చేసింది. శర్వానంద్ తండ్రిగా నరేష్ మరోసారి తన స్పెషల్ కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. సత్య, సునీల్, సుదర్శన్, సంపత్ రాజ్ కామెడీ నవ్వుల వర్షం కురిపిస్తుంది.
ఆత్రేయపురంలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో శర్వానంద్ మాట్లాడుతూ.. ఇది.. ఆత్రేయపురం పూతరేకుల లాంటి సినిమా అనే ట్యాగ్ లైన్ పెట్టాలనిపించినట్లు చెప్పారు. మీ అందరిని హ్యాపీగా నవ్వించాలని తీసిన సినిమా ఇది అని తెలిపారు. అందరూ ఈ సినిమాకు వచ్చి ఆనందంగా నవ్వితే అదే మాకు పండగ అని అన్నారు. టికెట్ రేట్లు పెంచడం లేదని పేర్కొన్నారు.
