Thursday, April 9, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంNarayana | నిబంధనలకు పాతరేస్తున్న నారాయణ జూనియర్ కాలేజీలు

Narayana | నిబంధనలకు పాతరేస్తున్న నారాయణ జూనియర్ కాలేజీలు

సి.బీ.ఎస్.ఈ. 10 తరగతి ఫలితాలు రాకముందే ఇంటర్ ఫస్టియర్ క్లాసులు

  • సమ్మర్ హాలిడేస్ పేరుతో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న దుర్మార్గం..
  • దీనిని విద్యా మాఫియాగా వర్ణిస్తున్న పలువురు విద్యా మేధావులు..
  • ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు వుంటాయంటున్న విద్యార్థి సంఘాలు..

బండరాయి మీద ఎంత వర్షం పడితే ఏమి లాభం.. అలాగే నారాయణ కాలేజీల దురాగతాలు మీద ఎంత రాసినా ఫలితం ఉండటం లేదు.. అక్షరాలు సైతం సిగ్గుపడుతున్నాయి.. అధికార బలం, అర్ధ బలంతో పేట్రేగిపోతున్న నారాయణ కాలేజీల యాజమాన్యం పిల్లల భవిష్యత్తును కాల రాస్తోంది.. తాజాగా సి.బీ.ఎస్.ఈ. పడవ తరగతి ఫలితాలు వెలువడకముందే, పిల్లల తల్లిదండ్రులను భయపెట్టి మరీ విద్యారులను చేర్చుకుంటూ ఫస్ట్ ఇయర్ ఇంటర్ క్లాసులు మొదలెట్టేశారు.. అంతేకాకుండా ముందుగా ఫీజు చెల్లిస్తే డిస్కౌంట్ ఇస్తామంటూ చెబుతున్నారు..

- Advertisement -

తొందరగా చేరిస్తే క్లాసులో ముందు బెంచిలో కూర్చోబెడతాం.. లేదంటే వెనుక బెంచిలో కూర్చోబెడతాం అంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు తెలుస్తోంది.. ఆలస్యంగా అడ్మిషన్ తీసుకుంటే క్లాసులు మిస్ అవుతాయి అంటూ భయపెడుతున్నారు.. ఇది ఎంత మాత్రం వాంచనీయం కాదంటున్నారు విశ్లేషకులు, విద్యార్థి సంఘాల నాయకులు.. ఈ ప్రక్రియ అంతా కేవలం మొదటి సంవత్సరం వరకే.. రెండో సంవత్సరంలో మరోలా వేధింపులకు గురిచేస్తున్నట్టు తెలుస్తోంది..

తల్లి దండ్రులు కూడా ఆలోచించకుండా గుడ్డిగా కాలేజీ వాళ్ళు చెప్పినట్లు వింటూ గంగిరెద్దుల్లా తలూపుతున్నారు.. భవిష్యత్తులో తమ పిల్లలు ఉన్నత స్థాయికి ఎదుగుతారని అనుకుంటున్నారు తప్ప.. వారి భవిష్యత్తు బుగ్గిపాలవుతుందని ఊహించలేకపొతున్నారు.. నారాయణ చేస్తున్న దుర్మారాగాలు చూసీ చూడనట్లు వదిలేస్తున్న ప్రభుత్వాలు, అధికారులు ఈ పాపంలో భాగస్వాములు అవుతున్నారు..

తెలంగాణలో విద్యా వ్యవస్థను బహిరంగంగా సర్వనాశం చేస్తూ, ప్రభుత్వ నిబంధనలను అధఃపాతాళానికి తొక్కేస్తూ.. ముందుకెళ్తున్న నారాయణ జూనియర్ కాలేజీల దురాగతాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.. సి.బీ.ఎస్.ఈ. 10వ తరగతి ఫలితాలు రాకముందే ఇంటర్ ఫస్ట్ ఇయర్ క్లాసులు స్టార్ట్ చేశారు.. అదే విధంగా సమ్మర్ హాలిడేస్ పేరుతో విద్యార్థులను బలవంతంగా తరగతులకు లాగడం చేస్తున్నారు.. ఇది స్పష్టమైన అక్రమం, విద్యా మాఫియా ధోరణి అంటున్నారు విద్యా మేధావులు..

ఇంత జరుగుతున్నా, పలుమార్లు కాలేజీ మీద ఫిర్యాదులు చేసినప్పటికీ తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్టు కనీసం స్పందించలేదు.. కాగా ఇంటర్మీడియట్ బోర్డు అకాడమిక్ జాయింట్ సెక్రటరీ నిర్లక్ష్యం అగ్నికి ఆజ్యం పోసినట్లు మరింత అనుమానాలకు తావిస్తోంది. చూసి చూడనట్టుగా ఉండటం అంటే, నారాయణ కాలేజీ చేస్తున్న ఈ అక్రమాలకు మౌనంగా మద్దతు ఇవ్వడమేనా? అని ప్రశ్నిస్తున్నారు పలువురు.. ఇది కేవలం ఒక కాలేజ్ విషయం కాదు.. ఇది మొత్తం విద్యా వ్యవస్థపై దాడి.. తక్షణమే నారాయణ జూనియర్ కాలేజ్ పై క్రిమినల్ స్థాయి దర్యాప్తు ప్రారంభించాలి..

అక్రమంగా నిర్వహిస్తున్న సమ్మర్ క్లాసులను తక్షణమే బంద్ చేయాలి.. అదే విధంగా నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి. నిర్లక్ష్యం వహించిన అధికారులను సస్పెండ్ చేయాలి.. లేకపోతే… రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు, కాలేజీల ముట్టడులు, విద్యార్థి ఉద్యమాలు తప్పవు.. అవసరమైతే కోర్టుల దాకా వెళ్లి న్యాయం సాధిస్తాం.. విద్యను వ్యాపారంగా మార్చిన వారిపై యుద్ధమే మా సమాధానం.. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు ఆడితే సహించము.. అని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు విద్యార్థి సంఘం నాయకులు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News