Wednesday, March 4, 2026
Homeఆంధ్రప్రదేశ్Nara Lokesh | డల్లాస్‌లో లోకేష్‌కి ఘన స్వాగతం

Nara Lokesh | డల్లాస్‌లో లోకేష్‌కి ఘన స్వాగతం

ఏపీ మంత్రి(AP Minister), తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ ప్రధాన కార్యదర్శి (National General Secretary) నారా లోకేష్‌కి అమెరికా(America)లోని డల్లాస్‌(Dallas)లో తెలుగు డయాస్పోరా (Telugu Diaspora) నుంచి ఘన స్వాగతం లభించింది. అమెరికాలోని తెలుగు ప్రజలు తనపై ఇంత ప్రేమ కురిపించటం, సాదరంగా ఆహ్వానించటం చాలా ఆనందంగా ఉందని లోకేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని చిరస్మరణీయం చేసినందుకు NRI TDPకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

తన శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ పోలీసుల ఆంక్షల కారణంగా వేదిక వద్ద ఉన్న ప్రతి ఒక్కరినీ కలవలేకపోయానని తెలిపారు. వారితో ఫోటో దిగలేకపోయానని, అందుకు హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. ఈసారి వచ్చినప్పుడు ఇలా జరక్కుండా చూసుకుంటానని మాట ఇచ్చారు. తనపై చూపించిన ఈ ప్రేమకు రుణపడి ఉన్నానని వెల్లడించారు.

- Advertisement -

‘డల్లాస్‌లోని మీరు నాకు ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా ఈ విలువైన సమయాన్ని మీరు కూడా సొంతం చేసుకున్నారు. తెలుగుడయాస్పోరా నుంచి వచ్చిన మరపురాని ఆతిథ్యాన్ని, పెద్ద సంఖ్యలో వచ్చినవారిని చూసి నేను చాలా సంతోషంగా ఉన్నాను. టెక్సాస్‌(Texas)లో అమరావతికి కొత్త శివారు ప్రాంతం ఉన్నట్లు అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ పట్ల మీ ప్రేమ, మద్దతు & నిబద్ధతకు మీలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అని నారా లోకేష్ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News