Tuesday, March 3, 2026
Homeఆంధ్రప్రదేశ్AP | మంగళగిరి నారసింహుడి సేవలో లోకేష్ దంపతులు..

AP | మంగళగిరి నారసింహుడి సేవలో లోకేష్ దంపతులు..

  • ఘనంగా స్వాగతం పలికిన ఆలయ అధికారులు, స్థానిక నాయకులు

మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్‌, ఆయన అర్ధాంగి బ్రహ్మణి పాల్గొన్నారు. సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు నిర్వహించిన శ్రీవారి కల్యాణ మహోత్సవంలో పాల్గొని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

వార్షిక బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన శ్రీవారి కల్యాణాన్ని పురస్కరించుకుని ఆలయానికి చేరుకున్న లోకేశ్‌, బ్రహ్మణి దంపతులకు దేవస్థానం అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన స్వామివారి కల్యాణాన్ని వారు భక్తిశ్రద్ధలతో తిలకించారు.

- Advertisement -

కార్యక్రమం ముగిశాక వేద పండితులు మంత్రి దంపతులకు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. ఈ పవిత్రమైన కల్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో మంగళగిరి క్షేత్రంలో పండుగ వాతావరణం నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News