- డి టి డి ఓ, సీనియర్ అసిస్టెంట్‌పై కలెక్టర్ సీరియస్..
- పూర్తి స్థాయి విచారణకు అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) నియామకం..

గిరిజన సంక్షేమ శాఖ, డిటిడిఓ (Department of Tribal Development Officer) కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ అక్రమాలపై జిల్లా కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాఠి సీరియస్‌గా స్పందించారు.సీనియర్ అసిస్టెంట్ అక్రమ బదిలీ, డిప్యూటేషన్ దుర్వినియోగం, వేతన చెల్లింపుల్లో లోపాలు ఉద్యోగుల వేధింపుల పై ‘ఆదాబ్ హైదరాబాద్’ పత్రికలో వచ్చిన వరుస కథనాలు, మరియు దీనిపై పలు విద్యార్థి సంఘాలు కలెక్టరుకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో, ఆమె పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది.

అదనపు కలెక్టర్‌కు అమిత్ నారాయణ్ కు బాధ్యతలు..(స్థానిక సంస్థలు)
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, అదనపు కలెక్టర్ ((Local Bodies)) విచారణాధికారిగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు, విచారణకు హాజరు కావాలంటూ డి.టి.డి.ఓ.కు అత్యవసర ఆదేశాలు జారీ అయ్యాయి. నవంబర్ 19, 2025 బుధవారం రోజున అడిషనల్ కలెక్టర్ గారి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు సమాచారం.
