Monday, January 19, 2026
EPAPER
Homeవరంగల్‌Awareness | ప్లాస్టిక్ నిషేధించి, మట్టి పాత్రలు వాడండి.

Awareness | ప్లాస్టిక్ నిషేధించి, మట్టి పాత్రలు వాడండి.

  • నల్లగొండ జిల్లా నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ.
  • రాష్ట్ర నాయకులు ఏడుకొండల వెంకటేశం, ఆమంచి రాజలింగం.

నల్లగొండ జిల్లా నూతన సంవత్సరం (2026) క్యాలెండర్ను తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నల్లగొండ జిల్లా క్యాలెండర్ ఇంచార్జ్ నిమ్మనగోటి శ్యాం ప్రసాద్ అధ్యక్షతన, బుధవారం తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం రాష్ట్ర కోశాధికారి ఆమంచి రాజలింగం, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏడుకొండల వెంకటేశం బోగి పండుగ సందర్బంగా ఆవిష్కరించడం జరిగింది. నల్గొండ జిల్లా కేంద్రంలోని రాజలింగం ఫైనాన్స్, మాస్ కాంప్లెక్స్ వద్ద జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏడుకొండల వెంకటేశం, రాష్ట్ర కోశాధికారి ఆమంచి రాజలింగం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతయుతంగా పని చేస్తూ నల్లగొండ జిల్లాను రాష్ట్రంలో ముందంజలో ఉంచాలని, ప్లాస్టిక్ ను నిషేధించాలని, మట్టి పాత్రలను వాడాలని కోరుతూ, మానవాళికి కుమ్మరి తొలిమెట్టు మట్టికుండా ఆయువుపట్టు అని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు కంభంపాటి సత్యనారాయణ, నల్లగొండ జిల్లా కన్వీనర్ రాధారపు బిక్షపతి, కో కన్వీనర్ గంగాధర్ వెంకటేశ్వర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు బొడ్డుపల్లి రమేష్, చిట్టిమల్ల దశరథ, నిదానంపల్లె వెంకటస్వామి, కంచర్ల రాము, బత్తుల కృష్ణయ్య, కంభంపాటి సతీష్, చిట్టిమల్ల ఆంజనేయులు, నిమ్మగోటి సత్తయ్య, అరూరి బాల నరసయ్య, ఆమంచి వెంకటేశ్వర్లు, ఆమంచి శ్రీనివాస్, యువత విభాగం జిల్లా కన్వీనర్ ఏరుకొండ హరి, ఉద్యోగ విభాగం జిల్లా కన్వీనర్ శాతరాజుపల్లి రాము, నాగార్జునసాగర్ నియోజకవర్గం ఇంచార్జ్ ఎలిజాల వెంకన్న, మునుగోడు నియోజకవర్గం ఇంచార్జ్ సిలువేరు సత్తయ్య, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ ఈ.సీ మెంబర్ ఎర్ర ప్రకాష్, నార్కట్పల్లి మండల అధ్యక్షులు మిడిదొడ్డి రాజు, ప్రధాన కార్యదర్శి మాసంపల్లి సైదులు, కోశాధికారి బొడ్డుపల్లి శంకర్, మునుగోడు మండల యూత్ కన్వీనర్ ఏడుకొండ రవితేజ, బండారు అంజయ్య, ఏరుకొండ నాగరాజు, ఆమంచి మధు, ఆమంచి రవి, ఎర్ర సైదులు, ఎర్ర అంజయ్య, ఎర్ర ప్రకాష్, మునుగోడు మండల నాయకులు కులస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News