Tuesday, October 28, 2025
ePaper
Homeఫోటోలు'కుబేర' డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున  

‘కుబేర’ డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున  

సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ శేఖర్ కమ్ముల ‘కుబేర’. అద్భుతమైన తారాగణంతో కుబేర ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవబోతోంది.

కుబేర మూవీ జూన్ 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా కింగ్ నాగార్జున ‘కుబేర’కు తన డబ్బింగ్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా డబ్బింగ్ స్టూడియోలో నాగార్జున, శేఖర్ కమ్ముల, నిర్మాత పుష్కర్ రామోహన్ కలసి మాట్లాడుతున్న ఫోటోలని మేకర్స్ షేర్ చేశారు.

ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పోయిరా మామ, ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’ చార్ట్ బస్టర్ రెస్పాన్స్ తో మ్యూజిక్ చార్ట్స్ లో టాప్ ట్రెండింగ్ లో వున్నాయి. ప్రమోషనల్ కంటెంట్ తో కుబేర మీద ఉన్న హైప్  నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది.  

క్యారెక్టర్ బేస్డ్ నరేటివ్స్ తో అదరగొట్టే శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని నెవర్ బిఫోర్ గా తీర్చిదిద్దారు, ఇది ఈ సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు.

kubera dubbing completed
kubera dubbing completed

కుబేర తెలుగు, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News