Wednesday, February 18, 2026
Homeరంగారెడ్డిNagaram | విశిష్ట ప్రతిభా రత్న పురస్కార్ అవార్డు..

Nagaram | విశిష్ట ప్రతిభా రత్న పురస్కార్ అవార్డు..

  • గవర్నర్ చేతుల మీదుగా అందుకున్న నాగారం సెరినిటీ విద్యారులు..

హిందీ సేవా సదన్ మహావిద్యాలయ్ నిర్వహించిన పరీక్షలో నాగారం సెరినిటీ పాఠశాల విద్యార్థులు హరిక, ఆరాధ్య రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించి రూ.2500/- పురస్కారంతో పాటు, బంగారు పతకం మరియు ప్రశంసా పత్రం అందుకున్నారు. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని స్వీకరించారు. గవర్నర్ చేతుల మీదుగా మా విద్యార్థులు ప్రతిభా రత్న పురస్కారాన్ని పొందడం ఎంతో గర్వంగా ఉందని సెరినిటీ పాఠశాల కరస్పాండెంట్ నోముల జంగిరెడ్డి పేర్కొన్నారు. అలాగే ఈ విజయాన్ని సాధించిన విద్యార్థులను సత్కరించి అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News