- “అవురావురు”మంటూ జనాలు ఆరగిస్తున్నారు
- కాసులకు కక్కుర్తి పడి హోటల్ యజమానుల దోపిడీ
మనిషి ఆకలి తీర్చే అన్నాన్ని “పరబ్రహ్మ స్వరూపం’గా చూసే దేశ సంస్కృతి మనది. అలాంటి ఆహారాన్ని కాసుల యావతో, నేరపూరిత నిర్లక్ష్యంతో ములుగుజిల్లాలోని ఏజన్సీ ఏరియా ప్రాంతానికి చెందిన కొందరు రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల యజమానులు విషతుల్యంగా,గరళంగా మార్చేస్తున్నారు.ఆరోగ్యం గా ఉండే జనం ఏమైపోయినా పర్వాలేదు వారికి మాత్రం డబ్బే ప్రధానం కాసుల వర్షం మాత్రమే ముఖ్యమన్నట్లుగా కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్పుడ్ సెంటర్లు, క్యాటరింగ్ సంస్థల నిర్వాహకులు బరితెగిస్తున్నారు.
రోజుల తరబడి ఫ్రిజ్ లలో నిల్వ ఉంచడంతో పాడైపోయిన ఆహార పదార్థాలకు ప్రమాదకర ఫాస్ట్ ఫుడ్ రంగులు, నాణ్యతలేని మసాలా దినుసులు దట్టించి వేడి వేడిగా వడ్డిస్తూ విక్రయిస్తున్నారు. మిగిలిన ఆహారాన్నీ తెల్లారి వేడిచేసి వినియోగదారులకు అంటగట్టేస్తున్నారు.దీర్ఘకాలికంగా వాటిని తిన్నవారు అల్సర్లతో, పలు రకాల క్యాన్సర్లతో పాటు ఎన్నో రకాల వ్యాధుల కోరల్లో చిక్కుతున్నారు.
మరోవైపు పలు ప్రభుత్వ సంక్షేమ,అంగన్వాడీ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలు, వర్సిటీల హాస్టళ్లలో వడ్డిస్తున్న నాసిరకం భోజనం విద్యార్థుల, పసిపిల్లల ప్రాణాలపైకి తెస్తోంది.అలాగే పెళ్లిళ్ళు ఇతర శుభకార్యాలు, వేడుకలప్పుడు భారీ వంటపాత్రలను సరిగ్గా కరగకపోవడమూ ఆహారాన్ని హానికరంచేసి ఎంతోమందిని ఆస్పత్రుల పాలేస్తోంది.తెలంగాణా రాష్ట్రంలో ములుగు జిల్లా అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్న ప్రాంతం కావడం గమనార్హం.
దీంతో ప్రతి రోజు, ముఖ్యంగా శని,ఆదివారాల్లో వీకెండ్ కోసం వేలాది మంది పర్యాటకులు, యాత్రికులు ములుగుజిల్లా కేంద్రం తోపాటు జంగాలపల్లి, రామప్ప, వెంకటాపురం చల్వాయి, పస్రా, గోవిందరావుపేట,తాడ్వాయి, మేడారం, చిన్న బోయినపల్లి, ఏటూరునాగారం,జగన్నాథపురం, వాజేడు,పూసురు, వెంకటాపురం,కన్నాయిగూడెం, కమలాపురం, మంగపేట, మల్లూరు, రాజుపేట లాంటి చోట్ల పర్యాటకులు,యాత్రికులు, భక్తులు భారీగా తరలివస్తూ ఆయా చోట్ల ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు,ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు,వీధి వ్యాపారుల వద్ద ఇలాంటి విష్యతుల్య ఆహారాన్ని తప్పనిసరిగా అవురావురుమంటూ తింటున్నారు.
కలుషిత ఆహారాన్ని గత్యంతరం లేక తీసుకుంటున్నారు. భారత రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయ ఇటీవలి నివేదిక ప్రకారం విషాహారం మూలంగా 2003లో అస్సాం తెలంగాణ, ఉత్తరప్రదేశ్లో ఎక్కువ ప్రాణనష్టం సంభవించింది. దేశవ్యాప్తంగా అలాంటి ప్రతి ఆరు మరణాల్లో ఒకటి తెలంగాణలో వెలుగుచూడటం విచారకరం తరతమ భేదాలతో దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ ఆహార కల్తీ, దిగనాసి చిరుతిండ్ల విక్రయాలు పెద్దయెత్తున సాగుతూ ప్రజారోగ్యాన్ని పొట్టనపెట్టుకుంటున్నాయి.
గడిచిన అయిదేళ్లలో దేశవ్యాప్తంగా పరిశీలించిన ప్రతి అయిదు ఆహార శాం పిళ్లలో ఒకటి నాసిరకమేనని కేంద్రం కొద్ది రోజుల కిందట వెల్లడించింది. నిజానికి సిబ్బంది కొరత, అరకొరగా శాంపిళ్ల సేకరణ, తగినన్ని ల్యాబుల లేమి, కొంతమంది అధికారుల అవినీతి కారణంగా చాలామంది దుర్మార్గులు చట్టానికి దొరకట్లేదు. కలుషితాహారం, నీటి కారణంగా నిరుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎనిమిదివేల గ్యాస్ట్రోఎంటరైట్స్ కేసులునమోదయ్యాయి.
కానీ, ఆ ఏడాది దాదాపు పదివేల ఆహారశాలల నుంచి యంత్రాంగం సేకరించిన 3600 నమూనాల్లో కేవలం 107శాతమే ప్రమాణాలకు తిలోదకాలిచ్చినట్లు తేలడు పై విమర్శలు వ్యక్తమయ్యాయి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ప్రస్తుతం ఒక్కటే ల్యాబ్ ఉండటంతో ఆహార నాణ్యతా పరీక్షలు అలస్య మవుతున్నాయి. దీనికి తోడు తూతూమంత్రం చర్యలూ పసలేని వాడనల వల్ల ఎన్నో కేసులు కోర్టుల్లో తేలిపోతున్నాయి. లేదా అరకొర జరిమానాలతో ముగిసిపోతున్నాయి.
గడువు తీరిన లేదా చెడిపోయిన పదార్థాలు వాడటం, నిల్వలో అలక్ష్యం కీటకాలూ ఎలుకలకు అలవాలాలైన ఆపరిశుభ్ర కిచెన్లు వంటకు మంచినీరు వినియోగించకపోవడం లాంటివి ఆహార కాలుష్యానికి ప్రధాన కారణాలు వీటివల్లనే హాస్టళ్లలో బీతావహ పరిస్థితులు నెలకొంటున్నాయి.
వనపర్తి జిల్లా బీసీ ఇంటర్ బాలికల వసతిగృహం, ఖమ్మం జిల్లాలోని ఒక ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో ఇటీవల పలువురు విద్యార్థులు విలవిల్లాడారు. కాకి నాడ, చిత్తూరు, తిరుపతి వంటి జిల్లాల్లోనూ ఇలాంటి ఘటనలు వెలుగు చూశాయి. పిల్లల ఆరోగ్య భద్రత దృష్ట్యా వసతి గృహాల స్థితిగతులను మెరు గుపరచడం ప్రభుత్వాలకు ప్రాధాన్యాంశం కావాలి.
నాణ్యత లేని పదార్థాలను అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారికి కఠిన దండనలు పడేలా చూడాలి. ఆహార కల్తీ కారణంగా ఇప్పటికే దేశంలో ఏటా పదికోట్ల మంది జబ్బుపడుతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2000 నాటికి బాధితుల సంఖ్య 121 కోట్ల దాకా పెరుగుతుందన్న అంచనాలు బెంబేలెత్తిస్తున్నాయి. జనజీవన హక్కు గాలిలో దీపం కాకూడదంటే. ప్రభుత్వాలు ఇకనైనా మేల్కొని తగిన కార్యాచరణకు ఉపక్రమించాలి.
