Monday, February 23, 2026
Homeవరంగల్‌Mulugu | మరోసారి విహారయాత్రకు ముఖ్యమంత్రి, మంత్రులు..

Mulugu | మరోసారి విహారయాత్రకు ముఖ్యమంత్రి, మంత్రులు..

  • ముఖ్యమంత్రి, మంత్రుల జిల్లా పర్యటనతో రైతులకు ఒరిగేది ఏమీ లేదు!
  • దేవాదుల ప్రాజెక్టుకు ఒక్క రూపాయి నిధులు కేటాయించని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లాలో పర్యటించే అర్హత లేదు!!
  • బిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ బడే నాగజ్యోతి మండిపాటు

రెండు సంవత్సరాలుగా దేవాదుల ప్రాజెక్టు లో తట్టెడు మట్టి తీయలే,. సుక్క నీరు ఇవ్వలే..
దేవాదుల ప్రాజెక్టును రెండు సంవత్సరాల లో పూర్తి చేస్తామని అసెంబ్లీ ఎన్నికలలో బూటకపు హామీ ఇచ్చి ,జిల్లా రైతులను మోసం చేసి గెలిచింది చాలక ములుగుజిల్లా కు మరోసారి పర్యాటకులుగా వస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, మంత్రుల వైఫల్యం వల్ల దేవాదుల ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు పెనుశాపంగా మారిందని బారసా ములుగు నియోజకవర్గ ఇంచార్జి, మాజీ జెడ్పీటీసీ బడే నాగజ్యోతి ఆరోపించారు.

ఆదివారం ములుగుజిల్లా కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల ప్రాజెక్టు ను సందర్శించడానికి ఆఘమేఘాల మీద వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రుల బృందం జరుపుతున్న పర్యటన సందర్భంగా ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -

దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు గడిచిందని, ఒక్క పంపుహౌస్ ను సరిగా నడపలేకపోతుందని ఆమె విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం, జిల్లా మంత్రుల నిర్లక్ష్యం వల్ల వరంగల్ జిల్లా రైతులకు దేవాదుల నీళ్లు సరిపడా అందడం లేదన్నారు.

మాజీ మంత్రి హరీష్ రావు ఇటీవలే చేసిన పర్యటనతో నిద్రలేచిన ప్రభుత్వం ఇప్పుడిప్పుడే నిద్రమత్తు వదిలిపెట్టి పర్యాటక ప్రదేశాలు ఉన్న ప్రాంతంలో పర్యాటకులుగా తిరిగి మరల మరల వస్తున్నారని ఆమె దుయ్యబట్టారు.గోదావరి నదిలో సరిపడా నీళ్లు ఉన్నా, ప్రభుత్వ నిర్లక్ష్యంతో గోదావరి నీళ్లు ను రైతులకు అందించడం లేదన్నారు.

ఒక్క సాగునీటి ప్రాజెక్టును కూడా పూర్తిచేసి రైతులకు సాగునీరు ఇవ్వలేని అసమర్ధ ప్రభుత్వo కాంగ్రెసు పార్టీ ప్రభుత్వం అన్నారు.
90 శాతం ప్రాజెక్టు పనులను కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేస్తే రెండున్నర సంవత్సరాలుగా ఒక్క శాతం పని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ చేయలేకపోయిందని మండిపడ్డారు.

పంట కాలువల కోసం భూ సేకరణ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు.
కేసీఆర్ పైన మొరగడానికే..నేతలపై కరవడానికి ముఖ్యమంత్రికి, మంత్రులకు రెండు సంవత్సరాలు సరిపోయిందని నాగజ్యోతి దుయ్యబట్టారు.రాబోవు స్థానిక పరిషత్ ఎన్నికలలో రైతులు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని, ఓటమి భయంతో ముఖ్యమంత్రి ప్రాజెక్టు పేరుతో ములుగు జిల్లా పర్యటన చేస్తున్నాడన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News