Thursday, March 12, 2026
Homeబిజినెస్Billionaire | ఎదురులేని ముకేశ్ అంబానీ..

Billionaire | ఎదురులేని ముకేశ్ అంబానీ..

  • శ్రీమంతుల జాబితాలో నెంబర్ వన్..
  • వెల్లడించిన ఫోర్బ్స్ మ్యాగజైన్..

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ హవా కొనసాగుతున్నది. 2026 సంవత్సరానికిగాను అంతర్జాతీయ మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌ విడుదల చేసిన దేశీయ శ్రీమంతుల జాబితాలో 99.6 బిలియన్‌ డాలర్ల వ్యక్తిగత సంపదతో రిలయన్స్‌ అధినేత తన తొలిస్థానాన్ని పదిలపరుచకున్నట్టు వెల్లడించింది.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 12 శాతం బలపడటంతో ఆయన వ్యక్తిగత సంపద పెరగడానికి దోహదం చేసిందని పేర్కొంది. అయినప్పటికీ ఆయన సంపద 100 బిలియన్‌ డాలర్లకు కొద్ది దూరంలో నిలిచిపోయారు. రెండో స్థానంలో అదానీ గ్రూపు చైర్మన్‌ గౌతమ్‌ అదానీ 63.8 బిలియన్‌ డాలర్ల సంపదతో నిలిచారు. అంబానీ, అదానీల వ్యక్తిగత సంపద 14.7 బిలియన్‌ డాలర్ల మేర పెరిగినట్టు ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ వెల్లడించింది.

- Advertisement -

యువ బిలియనీర్‌గా అరవింద్‌ శ్రీనివాస్‌ నిలిచారు. శాన్‌ ఫ్రాన్సిస్సో కేంద్రంగా పనిచేస్తున్న ఏఐ స్టార్టప్‌ పర్‌ప్లెక్సిటీ(జెఫ్‌ బెజోస్‌ వెనుకుండి) కో-ఫౌండర్‌గా వ్యవహరిస్తున్నారు. కంపెనీ విలువ 20 బిలియన్‌ డాలర్లుగా ఉన్నది. వీరితోపాటు పలువురు యువ పారిశ్రామికవేత్తలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News