Saturday, March 21, 2026
Homeనల్లగొండMothkur | తై బజార్ ను నిర్వహించడానికి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న చైర్ పర్సన్

Mothkur | తై బజార్ ను నిర్వహించడానికి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న చైర్ పర్సన్

మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో ప్రతి ఆదివారం అంగడి బజార్ రోడ్డులో నిర్వహించే తై బజారు (కూరగాయలు,పండ్లు) సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతున్న కారణంగా రైతులు,వ్యాపారస్తులు, వినియోగదారులు తై బజార్ ను వినియోగించుకో లేక గత మూడు నెలలుగా పాత బస్టాండ్ మెయిన్ కూడలిలో రోడ్డుకు ఇరువైపులా కూరగాయలు,పండ్లు,ఇతర వగైరా సామాగ్రిని అమ్ముతున్నారు.

ప్రస్తుతం అంగడి బజార్ లోని సిసి రోడ్ల నిర్మాణం పూర్తి అవ్వగా,ఈనెల 22 నుండి తై బజారు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను శనివారం మోత్కూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం స్వప్న సోమ నరసయ్య పర్యవేక్షించారు. పర్యవేక్షణలో మున్సిపల్ కమిషనర్ కే.శ్రీకాంత్,మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News