Tuesday, March 3, 2026
Homeకరీంనగర్Yoga | జాతీయ స్థాయి యోగా పోటీలకు సెయింట్ జార్జ్ విద్యార్థిని

Yoga | జాతీయ స్థాయి యోగా పోటీలకు సెయింట్ జార్జ్ విద్యార్థిని

కరీంనగర్ లోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ పాఠశాల(సి బి ఎస్ ఈ)లో 5వ తరగతి చదువుతున్నటువంటి మోనాలిక తెలంగాణ యోగ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలో నిర్వహించినటువంటి 12వ ఇంటర్ డిస్ట్రిక్ట్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్-2025 లో పాల్గొని , ఆరవ స్థానం కైవసం చేసుకుని జాతీయ స్థాయికి ఎంపికైనట్లు సెయింట్ జార్జ్ పాఠశాల చైర్మన్ డాక్టర్ పి ఫాతిమారెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయస్థాయి యోగాకు తమ పాఠశాలకు చెందిన విద్యార్థిని ఎంపికవడం తమకు ఎంతో గర్వకారణం అని విద్యార్థిని మోనాలికకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థాయి లో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు అన్నారు యోగా కోచ్ మల్లిక మోనాలిక తల్లిదండ్రులను అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News