Sunday, March 22, 2026
HomeజాతీయంDiplomacy | పౌరుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి..

Diplomacy | పౌరుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి..

  • ఇజ్రాయిల్ ప్రధానితో మోడీ ఫోన్ సంభాషణ..
  • ఘర్షణలను వీలైనంత త్వరగా ముగించమని విజ్ఞప్తి..

ఇరాన్‌ తో ఇజ్రాయెల్‌-అమెరికా చేస్తున్న యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ప్రస్తుత పరిస్థితులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహుతో ప్రధాని నరేంద్రమోదీ ఫోన్‌లో మాట్లాడారు. యుద్ధం వేళ పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఇజ్రాయెల్‌ ప్రధానిని కోరారు. అదేవిధంగా ఇరాన్‌తో ఘర్షణలను సాధ్యమైనంత త్వరగా ముగించాలని సూచించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ తన ఎక్స్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. ‘పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరాం. అలాగే ఘర్షణలను సాధ్యమైనంత త్వరగా ముగించాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించాం’ అని మోదీ తన పోస్టులో పేర్కొన్నారు.

ఇదిలాఉంటే ఆదివారం రాత్రి భద్రతావ్యవహారాల క్యాబినెట్ కమిటీ భేటీ జరిగింది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించారు. ఇది దేశ భద్రత, వ్యూహాత్మక అంశాలపై నిర్ణయం తీసుకునే అత్యున్నత కమిటీ. పశ్చిమాసియాలో ఘర్షణల వల్ల తలెత్తిన పరిణామాలపై ఈ భేటీలో చర్చించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News