రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) స్థాపించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన శతజయంతి ఉత్సవాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
సభను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, ఆర్‌ఎస్‌ఎస్ దేశ నిర్మాణానికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. సరిగ్గా 100 సంవత్సరాల క్రితం ఈ గొప్ప రోజున ఆర్‌ఎస్‌ఎస్(RSS) అనే సంస్థ స్థాపన యాదృచ్చికం కాదని, అది వేలాది సంవత్సరాలుగా కొనసాగుతున్న ఒక గొప్ప సంప్రదాయానికి పునరుజ్జీవం అని ప్రధాని మోడీ అభివర్ణించారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు నిరంతరం, నిస్వార్థంగా దేశ సేవ, సమాజ సేవ కోసం అంకితభావంతో పనిచేస్తున్నారని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆర్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు 1963లో జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో కూడా గర్వంగా పాల్గొన్నారు అని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా, ప్రధానిమంత్రి ఆర్‌ఎస్‌ఎస్ దేశానికి చేసిన సేవలను చాటి చెప్పేలా ప్రత్యేకంగా రూపొందించిన స్మారక తపాలా బిళ్ళను మరియు నాణెలను విడుదల చేశారు.
మారిన్ని వార్తలు :