- సర్పంచ్ ముడావత్ గబ్రు చౌహాన్.
- నూతన 100 కె.వి విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు.
గ్రామాల అభివృద్ధిలో, సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరన్నకు తమ గ్రామస్థులం ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని సర్పంచ్ ముడావత్ గబ్రు చౌహాన్ పేర్కొన్నారు. నందిగామ మండల పరిధిలోని చాకలిదానిగుట్ట తండాలో నూతన ట్రాన్స్ ఫార్మర్ ని సర్పంచ్ గబ్రు చౌహాన్, గురువారం తన పాలకవర్గంతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ముడావత్ గబ్రు చౌహాన్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా విద్యుత్ లో ఓల్టేజ్ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇదే విషయాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించి, ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటుకు కృషి చేశారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యేకు గ్రామస్థుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మూడవత్ రవీందర్ నాయక్,వార్డు సభ్యులు శ్రీను నాయక్,జటావత్ రాజేష్ నాయక్,జటావత్ మాధవి లక్ష్మణ్ నాయక్,పాత్లావత్ బుజ్జి శంకర్ నాయక్,ముడావత్ శాంతి శ్రీనివాస్,మెగావత్ నాగేష్ నాయక్,మెగావత్ పత్తి శ్రీను, లైన్మెన్ రవి యాదవ్,నాయకులు లక్ష్మణ్ నాయక్,కరోబర్ శ్రీను, తండా వాసులు తదితరులు పాల్గొన్నారు.
