Tuesday, March 3, 2026
Homeవరంగల్‌Calendar | 'ఆదాబ్' క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే నాగరాజు

Calendar | ‘ఆదాబ్’ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే నాగరాజు

  • డిసిసి అధ్యక్షులు ఎండి అయూబ్.
  • పాల్గొన్న సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు.

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామంలో “ఆదాబ్ హైదరాబాద్” దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎండి అయూబ్ తో కలిసి ఆదివారం ఆవిష్కరించారు. చౌటపల్లి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మండలంలోని పలువురు సర్పంచులు, అధికార పార్టీ నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొని క్యాలెండర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు మాట్లాడుతూ ప్రజలు, ప్రభుత్వం మధ్య వారధిగా పత్రికలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు.

ప్రజల సమస్యలను నిరంతరం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక అంకితభావంతో కృషి చేస్తోందని ప్రశంసించారు. నిజాలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకువస్తున్న పత్రికగా అనతి కాలంలోనే ‘ఆదాబ్ హైదరాబాద్’ ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. భవిష్యత్తులో మరింత నాణ్యమైన వార్తలతో ముందుండి ప్రజల ఆదరాభిమానాలను సంపాదించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆదాబ్ యాజమాన్యానికి, సిబ్బందికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా సంచలన కథనాలతో ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందని ఈ సందర్భంగా పలువురు సర్పంచులు, రాజకీయ నాయకులు పేర్కొన్నారు.

- Advertisement -

ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో చౌటపల్లి సర్పంచ్ వెంకటేశ్వర్ రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్ నాయక్, పర్వతగిరి సర్పంచ్ చీదురు శంకర్, ఏనుగల్లు గ్రామ సర్పంచ్ తొర్రి పద్మ, అన్నారం షరీఫ్ గ్రామ సర్పంచ్ గాడిపెళ్లి మహేందర్, గోపనపల్లి గ్రామ సర్పంచ్ నాంపల్లి విజయ అశోక్, జమాల్ పురం గ్రామ సర్పంచ్ జున్ను కనకయ్య, ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక మండల రిపోర్టర్ కొల్లూరి నాగరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి సర్వర్, రతన్ రావు, చలపతిరావు, ఓరుగంటి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు దేవరాజ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News