Thursday, February 12, 2026
Homeమెదక్‌Harish Rao | రేవంత్‌రెడ్డికి దిమ్మతిరిగే తీర్పు

Harish Rao | రేవంత్‌రెడ్డికి దిమ్మతిరిగే తీర్పు

మెదక్ నియోజకవర్గం(Medak Constituency)లో బీఆర్‌ఎస్ పార్టీ మద్దతు(Brs Party Support)తో గెలిచిన సర్పంచ్‌(Sarpanch)ల సన్మాన కార్యక్రమానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు (MLA Harish Rao) హాజరయ్యారు. సర్పంచ్‌లను సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (Gram Panchayat elections) ప్రజలు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి దిమ్మతిరిగే తీర్పు ఇచ్చారని అన్నారు. గెలిచిన సభ్యులందరికీ శిరస్సు వంచి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.

హరీష్‌రావు ఇంకా ఏమన్నారంటే..

  • ఇది మామూలు విజయం కాదు.
  • ఎప్పుడైనా, ఏ రాష్ట్రంలోనైనా రూలింగ్ పార్టీ సర్పంచ్‌లు 80 నుంచి 90 శాతం మంది గెలుస్తారు.
  • కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ 40 శాతం సర్పంచ్‌లు గెలిచింది.
  • అంటే.. ఇది దేనికి సంకేతం?
  • ఒకవైపు రేవంత్ రెడ్డి కాలికి బలపం కట్టుకొని తిరిగిండు.
  • ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ జిల్లా జిల్లాలు తిరిగిండు.
  • అయినా కూడా జనం బండకేసి కొట్టారు.
  • తెలంగాణ పల్లె ప్రజలు రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగేలా తీర్పు ఇచ్చారు.
  • గుద్దుడు గుద్దితే 4000 సర్పంచ్‌లను బీఆర్ఎస్ గెలిచింది.
  • సింబల్ లేని సర్పంచ్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గూబ గుయ్యిమనిపిచ్చిండ్రు ప్రజలు.
  • రేపు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మైండ్ బ్లాక్ అయితది రేవంత్ రెడ్డికి.
  • బీఆర్ఎస్ సర్పంచ్ విజయం చూసి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెట్టే ధైర్యం రేవంత్ రెడ్డి చేయడు.
  • 90 శాతం గెలవాల్సిన అధికార పార్టీ 50% లోపుకే పరిమితమైంది.
  • 42 శాతం బీసీ రిజర్వేషన్ అని మోసం చేసిండు.
  • రైతుబంధు అని మోసం.
  • రైతులకు యూరియా ఇయ్యకుండా తిప్పలు
  • రుణమాఫీ సగం మందికి కూడా కాలే.
  • సన్న వడ్లకు బోనస్ ఎగ్గొట్టిండు.
  • దళిత బంధు బంద్ అయింది.
  • కేసీఆర్ కిట్టు బంద్ అయింది.
  • చెరువుల్లో చేపలు వేస్తలేరు.
  • గొర్రెల పంపిణీ పథకం బంద్ అయింది.
  • ఆడోళ్లకి ఫ్రీ బస్ అని మగవాళ్లకు డబుల్ టికెట్ కొడుతున్నాడు రేవంత్ రెడ్డి.
  • కేసీఆర్ ఉన్నప్పుడు వడ్లమ్మడానికి ఎప్పుడైనా తిప్పలు అయిందా?
  • యూరియా కావాలంటే తిప్పలు అయిందా?
  • మళ్లీ కేసీఆర్ సార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
  • గెలుపు అనేది మన బాధ్యతను పెంచుతుంది.
  • ఊరిలో ఉండి కష్టపడి పని చేసుకోవాలి.
  • ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలి.
  • బాధ్యతను నిలబెట్టుకోవాలి..
  • సర్పంచుల అధికారాలపై శిక్షణా కార్యక్రమం పెట్టుకుందాం.
  • ఓడినవాళ్లు నిరాశ చెందొద్దు.
  • భవిష్యత్తు ఉంటుంది.
  • గెలిచినవాళ్లు బాధ్యతతో పని చేయాలి.. మళ్లీ గెలవాలి.
  • రెండేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది.
  • కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు పోలింగ్ బూత్ దగ్గర కూర్చొని వంగి వంగి దండాలు పెట్టి ఓట్లు అడిగిండు.
  • యూరియా దొరకనప్పుడు ఎందుకు కుర్చీ వేసుకొని కూర్చోలేదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు?
  • పగలూ రాత్రీ రైతులు లైన్లలో నిల్చొని యూరియా కోసం తిప్పలు పడ్డప్పుడు ఎందుకు కుర్చీ వేసుకొని కూర్చోలేదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు?
  • గురుకులాల్లో పురుగులన్నం మాకొద్దని రోడ్లపై ధర్నా చేసినప్పుడు ఎందుకు కుర్చీ వేసుకొని కూర్చోలేదు?
  • కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొననప్పుడు కుర్చీ వేసుకొని కూసోలేదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.
  • అక్కాచెల్లెళ్లకు మహాలక్ష్మి కింద 60,000 బాకీపడ్డాడు రేవంత్ రెడ్డి.
  • రేవంత్ రెడ్డి ఇంటి ముందు కుర్చీ వేసుకొని కూర్చొని వసూలు చేయాల్సింది పోయి కుర్చీలు వేసుకొని కూర్చుని ఓట్లు అడుగుతారా?
  • ప్రజలు తెలివైనోళ్లు.
  • అందుకే కాంగ్రెస్‌ను బండకేసి కొట్టారు.
  • బీఆర్ఎస్‌ని గెలిపించారు.
  • రేవంత్ రెడ్డి.. ఫుట్ బాల్ షోకుల కోసం ఐదు కోట్లతో గ్రౌండ్ కట్టించుకోవడం కాదు..
  • మెస్సీతో ఫుట్ బాల్ ఆడడానికి 100 కోట్లు ఖర్చు చేసినవ్.
  • అందాల పోటీ కోసం 100 కోట్లు ఖర్చు చేసినవ్.
  • నువ్వూ నీ మనవడు క్రికెట్ ఆడడానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారా?
  • ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలు అమలు చెయ్..
  • మెదక్ గణపురానికి, పాపన్నపేటకి నీళ్లు ఇస్తారా లేదా చెప్పడం లేదు.
  • కేసీఆర్ ఉన్నప్పుడు మెదక్ జిల్లాలోని అన్ని మండలాలకు నీళ్లు వచ్చాయా లేదా..
  • గణపురం ఆనకట్టను బీఆర్ఎస్సే కదా ఆధునికీకరించింది.
  • బావుల దగ్గర రాత్రిపూట కరెంట్ ఉండటం లేదు.
  • మళ్లీ పాత కాంగ్రెస్ రోజులు వచ్చాయి.
  • రైతుల పక్షాన నిలబడదాం.
  • ఆరు గ్యారంటీల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దాం.
  • ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసుకుందాం.
  • మన సర్పంచ్‌లను, వార్డు మెంబర్లను ఎవరైనా ఇబ్బంది పెట్టితే నాకు ఒక మెసేజ్ పెట్టండి.
  • నేను డైరెక్ట్‌గా మీకు అండగా ఉంటా.
  • మీ జోలికొస్తే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు..
  • మిమ్మల్ని తిప్పలు పెడితే రాసి పెట్టుకోండి.
  • రెండేళ్ల తర్వాత వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. వడ్డీతో సహా చెల్లిద్దాం
  • పదేండ్లు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేశాం.
  • ఈ సారి మన ప్రభుత్వం వచ్చినంక అభివృద్ధి కోసం పని చేస్తాం.
  • మన జోలికి వచ్చినోళ్ల పని పట్టడానికి కూడా పనిచేస్తాం.
  • అధికారులు న్యాయంగా, ధర్మంగా పనిచేయాలి.
  • ఏకపక్షంగా పనిచేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మీ పని పడతాం.
- Advertisement -
RELATED ARTICLES

Latest News