శ్రీ పడకంటి రమేష్ చారి తన తమ్ముడు పడకంటి మహేష్ చారి (45) అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహేష్ చారి మానసిక స్థితి స్థిరంగా లేకపోవడంతో ఒంటరిగానే తన పనులు చేసుకుంటూ ఇతరులతో ఎక్కువగా మాట్లాడకుండా ఉండేవాడని తెలిపారు.
24 ఫిబ్రవరి 2026 రాత్రి సుమారు 10:30 గంటలకు కుటుంబ సభ్యులంతా నిద్రపోయిన తరువాత, 25 ఫిబ్రవరి ఉదయం సుమారు 4:00 గంటలకు మహేష్ చారి ఇంటి నుండి వెళ్లిపోయి కనిపించకుండా పోయాడు. తెలిసిన అన్ని ప్రదేశాలలో వెతికినా బంధువులకు సమాచారం ఇచ్చినా అతని ఆచూకీ లభించలేదు.

ఇంతకుముందు కూడా రెండుసార్లు ఇలానే వెళ్లిపోయి తిరిగి ఇంటికి వచ్చిన సందర్భాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఈసారి ఇప్పటివరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో అన్నయ్య రమేష్ చారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
