- వాట్సాప్ సందేశం తర్వాత అదృశ్యం
జవహర్ నగర్ పరిధిలో గృహిణి గల్లంతైన ఘటన కలకలం రేపింది. పులిగిళ్ల రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదుదారుడు తెలిపిన వివరాల ప్రకారం, తన భార్య పులిగిళ్ల లతతో కొంతకాలంగా దాంపత్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో 24 మార్చి ఉదయం సుమారు 07:00 గంటలకు భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం అదే రోజు మధ్యాహ్నం సుమారు 13:00 గంటలకు తన భర్త ఇంట్లో లేని సమయంలో లత ఇంటి నుండి వెళ్లిపోయింది.
25 మార్చి మధ్యాహ్నం సుమారు 12:40 గంటలకు తాను చనిపోతానని వాట్సాప్ ద్వారా సందేశం పంపింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. బంధువులకు సమాచారం ఇచ్చి, తెలిసిన ప్రదేశాల్లో వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. గల్లంతైన లత వయస్సు 34 సంవత్సరాలు, సుమారు 5 అడుగుల ఎత్తు, గోధుమ వర్ణం కలిగి ఉంది.
తెలుపు రంగు దుస్తులు ధరించి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెకు తెలుగు మాట్లాడే అలవాటు ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు గల్లంతైన మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని కోరుతున్నారు.
