Thursday, February 26, 2026
Homeరంగారెడ్డిMissing | యువతి అదృశ్యం కేసు నమోదు

Missing | యువతి అదృశ్యం కేసు నమోదు

జవహర్ నగర్ బీజేఆర్ నగర్ ప్రాంతానికి చెందిన ఒక యువతి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బీజేఆర్ నగర్ నివాసి అడ్డాల నాగరాజు, లేట్ లక్ష్మయ్య కుమారుడు, వయస్సు 46 సంవత్సరాలు, వృత్తి మేస్త్రీ, తన పెద్ద కుమార్తె అడ్డాల శ్రీవల్లి 24 ఫిబ్రవరి 2026 ఉదయం సుమారు 7.30 గంటల సమయంలో ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె సమీపంలోని కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది.

కుటుంబ సభ్యులు తెలిసిన ప్రాంతాలలో వెతికినప్పటికీ, స్నేహితులు బంధువులను సంప్రదించినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదని తెలిపారు. తన కుమార్తెతో తరచుగా ఫోన్ ద్వారా సంప్రదింపులు కొనసాగించే హుస్సేన్ బాషా అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేశారు. అతని ఫోన్ నంబర్లు కూడా పోలీసులకు అందజేశారు.

- Advertisement -

అదృశ్యమైన అడ్డాల శ్రీవల్లి వయస్సు 19 సంవత్సరాలు. ఎత్తు సుమారు 5 అడుగులు, గోధుమ వర్ణం, తెలుగు భాష మాట్లాడగలదు. ఆమె గల్లంతైన విషయంపై సమాచారం ఉన్నవారు సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని అధికారులు కోరారు.
ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాలలో విచారణ కొనసాగిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News