ఈ ఏడాదికి గాను మిస్ యూనివర్స్‌గా మెక్సికో (Mexico) భామ ఫాతిమా బాష్ (fatima bosch) నిలిచింది. విశ్వ సుందరి విజేత పోటీలను థాయ్‌లాండ్(Thailand)లో నిర్వహించారు. 2024 మిస్ యూనివర్స్ విక్టోరియా కెజార్ హెల్విగ్(Denmark) చేతుల మీదుగా కిరీటం (crown) అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 120 మందికి పైగా పాల్గొనగా ఫాతిమా బాష్ (25) తొలి ప్రయత్నంలోనే వాళ్లందరినీ వెనక్కి నెట్టింది. మొదటి రన్నరప్‌గా ఆతిథ్య దేశానికి చెందిన ప్రవీనర్ సింగ్, రెండో రన్నరప్‌గా స్టిఫానీ అబాసలీ(వెనెజువెలా) నిలిచింది. మన దేశం (India) నుంచి మణికా విశ్వకర్మ(Manika Vishwakarma) పోటీ పడ్డారు. అయితే.. ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ (Saina Nehwal) ఈ పోటీల న్యాయనిర్ణేతల్లో ఒకరిగా వ్యవహరించటం గమనార్హం.
Miss Universe 2025 | మిస్ యూనివర్స్‌గా మెక్సికో భామ
- Advertisement -
RELATED ARTICLES
