Saturday, October 4, 2025
ePaper
Homeతెలంగాణకేసీ వేణుగోపాల్‌ను కలిసిన మంత్రి వివేక్

కేసీ వేణుగోపాల్‌ను కలిసిన మంత్రి వివేక్

తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి ఇవాళ(జూన్ 10 మంగళవారం) ఢిల్లీలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్) కె.సి.వేణుగోపాల్‌ను కుటుంబ సమేతంగా కలిశారు. సతీమణి సరోజ, కుమారుడు (పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు) గడ్డం వంశీకృష్ణతో కలిసి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తనకు మంత్రి పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.

కొత్త మంత్రులకు ఏ శాఖలు ఇవ్వాలో తెలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్న నేపథ్యంలో వివేక్ కూడా పార్టీ పెద్దలను కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మీటింగ్‌లో వివేక్ తనకు ఏ శాఖ పైన ఆసక్తి ఉందో, అది ఇస్తే బాగుంటుందని కేసీ వేణుగోపాల్‌తో చర్చించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News