తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit)-2025కు హాజరుకావాలని కోరుతూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageshwar Rao).. మధ్యప్రదేశ్ సీఎం (Madhyapradesh CM) మోహన్ యాదవ్(Mohan Yadav)ను ఆహ్వానించారు. సీఎం రేవంత్ (CM Revanth) ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆ రాష్ట్రానికి వెళ్లి ఆహ్వానం అందజేశారు. ఈ నెల 8వ తేదీ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ(Bharat Future City)లో ఈ కార్యక్రమాన్ని దావోస్ సదస్సు స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎంలను ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా తుమ్మల నాగేశ్వరరావు మధ్యప్రదేశ్‌కు వెళ్లారు.
- Advertisement -
