పాలేరు నియోజకవర్గం(Paleru Constituency)లోని ఏదులాపురం మునిసిపాలిటీ(Edulpuram Municipality) పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) సోమవారం శంకుస్థాపనలు చేశారు. ఇందులో.. సుమారు రూ.2.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఏదులాపురాన్ని అన్ని రంగాల్లో రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన మునిపాలిటీగా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని చెప్పారు. సంక్షేమ పథకాల అమల్లో ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజల దీవెనలు ప్రభుత్వంపై ఉండాలని ఆకాంక్షించారు.
శంకుస్థాపన చేసిన పనుల వివరాలు
రూ.22.6 లక్షలతో కోట నారాయణపురంలో సీసీ రోడ్, డ్రైనేజీ.
రూ.72 లక్షలతో ఎస్సీ, బీసీ కాలనీల్లో అంతర్గత సీసీ రోడ్, డ్రైనేజీ.
రూ.44.55 లక్షలతో గుదిమళ్లలో రూ.75.85 లక్షలతో ఇందిరమ్మ కాలనీ-1లో అంతర్గత సీసీ రోడ్లు.
రూ.26.55 లక్షలతో నంద్యా తండాలో డ్రైన్లు.
రూ.14.10 లక్షలతో జంగాల కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ
