ఖమ్మం (Khammam) పట్టణం 60వ డివిజన్ రామన్నపేట(Ramannapet)లో కోటి రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ డ్రెయిన్ల (CC Drains) నిర్మాణానికి మంత్రి (Minister) పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti SrinivasaReddy) శంకుస్థాపన (Foundation stone laying) చేశారు. అనంతరం ఖమ్మం జిల్లాలో జరిగిన పలు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారికి నూతన వస్త్రాలను కానుకగా అందించారు.
ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన తోట దేవి ప్రసన్నను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. పలు ప్రాంతాల్లో వివిధ కారణాలతో మరణించినవారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి (MP Ramasahayam Raghuram Reddy), ఎమ్మెల్యే రాందాస్ నాయక్(MLA Ramdas Nayak), స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు.
