Tuesday, March 3, 2026
Homeఖమ్మంPonguleti | గ్రామ ప్రజాప్రతినిధులపై పెద్ద బాధ్యత

Ponguleti | గ్రామ ప్రజాప్రతినిధులపై పెద్ద బాధ్యత

గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy).. సర్పంచులు(Sarpanchs), ఉప సర్పంచ్‌లు, వార్డ్ మెంబర్లకు సూచించారు. పార్టీని, మమ్మల్ని నమ్ముకున్న కుటుంబాలను ప్రాణం ఉన్నంత వరకు అన్ని విధాలా కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) పర్యటనలో భాగంగా పినపాక నియోజకవర్గం (Pinapaka Constituency)లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లకు ఏడూళ్ల బయ్యారం జీవీఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమం(Fecilitation Programme)లో ఎంపీ బలరాం నాయక్, శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు, ఆదినారాయణ, తెల్లం వెంకటరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, కార్యకర్తలతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

‘కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దశాబ్ద కాలం బీఆర్ఎస్ పాలనలో అనేక ఇబ్బందులు, అవమానాలు, అవహేళనలకు గురైనప్పటికీ పార్టీ జెండాను విడిచిపెట్టలేదు. అలాంటివారిని ఈ రకంగా కొంత మందినైనా సన్మానించే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది.సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు ఎవరూ దిగులు పడొద్దు. పార్టీ పరంగా, వ్యక్తిగతంగా మీ ఇంటి పెద్ద కొడుకుగా తప్పకుండా అందరికీ అండగా ఉంటాను. గత పది సంవత్సరాలు ఏలిన పాలకులు రాష్ట్రాన్ని అన్ని విధాల ఆర్థికంగా కొల్లగొట్టారు. అధోగతిపాలు చేశారు. అయినా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం సాకులు చెప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటీ అమలుచేసుకుంటూపోతోందిది.పే

- Advertisement -

దవారికి భద్రత, భరోసాను కల్పిస్తోంది. ఇది గిరిజన అటవీ ప్రాంతం కావడం వల్ల కొన్ని మౌలిక సమస్యలు ఉన్నాయి. వాటిని తప్పకుండా రాబోయే రోజుల్లో తీరుస్తాం. అన్ని నియోజకవర్గాలకు 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే ఈ పినపాక నియోజకవర్గానికి 4500 ఇండ్లను మంజూరుచేశాం. అంటే సుమారు రూ.225 కోట్ల నిధులు ఈ నియోజకవర్గంలో ఇండ్ల కోసం ఖర్చు చేయడం జరిగింది. మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేలోపు ఇంకా మూడు విడతలుగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తాం. అర్హులైన వారందరికీ అందిస్తాం. సర్పంచులు, ఉప సర్పంచ్‌లు, వార్డ్ మెంబర్లపై పెద్ద బాధ్యత ఉంది. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషిచేయాలి. మీకు వ్యక్తిగతంగా ఏమైనా ఇబ్బందులుంటే తప్పకుండా వినడానికి మేమున్నాం. పార్టీని, మమ్మల్ని నమ్ముకున్న కుటుంబాలను గొంతులో ప్రాణం ఉన్నంత వరకు అన్ని విధాలా కాపాడుకుంటాం’ అని పొంగులేటి భావోద్వేగంగా ప్రసంగించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News