గ్రామ పంచాయతీ ఎన్నికల్లో(Gram Panchayat Elections) విజయం సాధించిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లకు భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గం (Bhadradri Kothagudem Constituency) చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలోని క్యాంప్ ఆఫీసులో నిర్వహించిన అభినందన కార్యక్రమాల్లో (Congratulatory meeting) మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) పాల్గొన్నారు. అశ్వారావుపేట, భద్రాచలం, ఇల్లందు, పినపాక, కొత్తగూడెం నియోజకవర్గాల్లోని గ్రామాల్లో గెలుపొందిన సుమారు 400 మందికి పైగా సర్పంచులను, వందలాది మంది వార్డు సభ్యులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు (Wishes) తెలిపారు.

ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. ‘ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఈ విజయాలు ఇందిరమ్మ పాలనపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 70 శాతానికి పైగా స్థానాల్లో మూడు రంగుల జెండాను రెపరెపలాడించడం వెనక కాంగ్రెస్ కార్యకర్తల కష్టం, కృషి ఎంతగానో ఉంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ(Mptc, Zptc Elections) ఇదే ఫలితాలు పునరావృతం అవుతాయి. ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు నిరాశ పడొద్దు. మీ శీనన్నగా నేను ఉన్నా. ఏ ఒక్క కార్యకర్తకు ఆపద వచ్చినా అండగా ఉంటా’ అని భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటితోపాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట ప్రసన్న, ఎమ్మెల్యేలు డాక్టర్ తెల్లం వెంకట్రావ్, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, ఆదినారాయణ, సీనియర్ నేత రాంరెడ్డి గోపాల్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


