Monday, January 19, 2026
EPAPER
Homeనల్లగొండNalgonda Municipal Corporation | సీఎం రేవంత్‌కి కృతజ్ఞతలు

Nalgonda Municipal Corporation | సీఎం రేవంత్‌కి కృతజ్ఞతలు

నల్గొండను మునిసిపల్ కార్పొరేషన్‌గా ప్రకటించిన సందర్భంగా నల్గొండ ప్రజల పక్షాన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) కృతజ్ఞతలు(Thanks) చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీ(Super Smart City)గా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్పొరేషన్ హోదాతో కేంద్రం నుంచి నేరుగా నిధులు తెచ్చుకునే అవకాశం లభించిందని పేర్కొన్నారు. ‘25 నెలల్లోనే కార్పొరేషన్ హోదాను సాధించాం. గతంతో పోలిస్తే మరింత వేగంగా అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇందిరమ్మ ఇండ్లు(Indiramma Indlu), డబుల్ రోడ్లు, సెంట్రల్ లైటింగ్, రూ.700 కోట్లతో ఓఆర్‌ఆర్, ధర్వేశిపురం వరకు 6 లైన్ల రోడ్డు, బ్రహ్మగారి గుట్ట–లతీఫ్ సాబ్ దర్గా గుట్ట అభివృద్ధి, దొరేపల్లి–అనంతారం రోడ్లు, ఎస్ఎల్‌బీసీ పూర్తి లక్ష్యం, ఏఎంఆర్‌పీ కాలువల లైనింగ్‌కు రూ.450 కోట్లు కేటాయిస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా నల్గొండను హైదరాబాద్‌లా అభివృద్ధి చేస్తాం. శాంతి, సమరస్యంతో కార్పొరేషన్ అభివృద్ధికి అందరూ సహకరించాలి’ అని కోమటిరెడ్డి కోరారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News