Wednesday, October 29, 2025
ePaper
Homeతెలంగాణమంత్రి ఇంటి ముందు నిర‌స‌న‌

మంత్రి ఇంటి ముందు నిర‌స‌న‌

మంత్రి సురేఖ ఇంటి వ‌ద్ద మధ్యాహ్న భోజన కార్మికుల ఆందోళన

హన్మకొండలో మంత్రి కొండా సురేఖ నివాసం ఎదుట మధ్యాహ్న భోజన పథకం కార్మికులు సోమవారం నిరసన ప్రదర్శించారు. మధ్యాహ్న భోజనం పథకాన్ని అక్షయపాత్ర సంస్థకు అప్పగించే ప్రతిపాదనను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం అమలైతే, పథకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వేలాది మందికి ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు.వెంటనే ఎనిమిది నెలలుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించాలని, కార్మికులకు ఉపాధి భద్రత కల్పించాలనే డిమాండ్లు వినిపించారు. సురేఖ ఇంట్లోకి ప్రవేశించేందుకు కొందరు ప్రయత్నించగా, అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకుని చెదరగొట్టారు. ప్రతిపాదనను వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి.

RELATED ARTICLES
- Advertisment -

Latest News