ఎల్ అండ్ టీ మెట్రో రైల్‌తో సెమీ నేమింగ్ రైట్స్ ఒప్పందం(Semi-naming rights agreement)
ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులోకి ఏఐ + ఆరోగ్య కియోస్క్
హైదరాబాద్: ఎల్ అండ్ టీ మెట్రో రైల్ లిమిటెడ్(L and T Metro Rail Limited)తో శ్రావణి హాస్పిటల్స్ (Sravani Hospitals) ఇవాళ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం కేపీహెచ్‌బీ కాలనీ మెట్రో స్టేషన్ (Kphb Colony Metro Station) పేరు ఇకపై “శ్రావణి హాస్పిటల్స్–కేపీహెచ్‌బీ కాలనీ మెట్రో స్టేషన్”గా మారనుంది. ఈ సందర్భంగా శ్రావణి హాస్పిటల్స్ అధ్యక్షుడు డా.నవీన్ చెట్టుపల్లి, వ్యవస్థాపకురాలు & సీఈఓ శ్రావణి చెట్టుపల్లి, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ లిమిటెడ్ సెక్యూరిటీ హెడ్ లోకేష్ సక్సేనా కొత్త పేరు పెట్టిన స్టేషన్‌ను ప్రారంభించారు. ప్రయాణికులు తమ ఆరోగ్య వివరాలను వెంటనే చూసుకునేందుకు వీలుగా ఉన్న ఏఐ (Artificial Intelligence) హెల్త్ కియోస్క్(Health Kiosk)ను కూడా అందుబాటులోకి తెచ్చారు.

ఈ సందర్భంగా డా. నవీన్ చెట్టుపల్లి మాట్లాడుతూ.. “శ్రావణి హాస్పిటల్స్–కేపీహెచ్‌బీ కాలనీ మెట్రో స్టేషన్ నామకరణ వేడుక జరుపుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. ఇది శ్రావణి హాస్పిటల్స్‌కు గర్వకారణమైన, చిరస్మరణీయమైన రోజని అన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్‌తో తమ భాగస్వామ్యం పైకి కనిపించేదే కాదని, ఇందులో లోతైన అనుబంధం దాగి ఉందని తెలిపారు. ఇది.. ఆరోగ్య సంరక్షణకు–సమాజానికి మధ్య, చేరుబాటుకు–విశ్వాసానికి మధ్య అనుబంధాన్ని పెంచే నిర్ణయమని పేర్కొన్నారు.

శ్రావణి చెట్టుపల్లి మాట్లాడుతూ.. “శ్రావణి హాస్పిటల్స్‌లో మేము నమ్మేదేంటంటే ఆరోగ్య సంరక్షణ అనేది నగరంతోపాటు ముందుకు సాగాలి. ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడికి చేరుకోవాలి. ఈ భాగస్వామ్యం మా ఆశయాన్ని అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. హైదరాబాద్ నగర దైనందిన కదలికలో మా పేరును సరిగ్గా గుండెల్లో నిలబెడుతుంది” అని వివరించారు.
మెట్రో ప్రయాణికులు ఇప్పటికే కియోస్క్‌లను ఉపయోగించడం ప్రారంభించారు. దాదాపు 30 మంది ప్రయాణికులు 1 గంట ఆపరేషన్లలోనే శ్రావణి AI+యంత్రం ద్వారా వైద్య పరిక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఉచిత ప్రథమ చికిత్స వస్తు సామగ్రిని పంపిణీ చేశారు. ఈ కొత్త కార్యక్రమం ద్వారా ప్రయాణికులు తమ బిజీ షెడ్యూల్స్‌లో ఆరోగ్యంపై దృష్టి పెట్టేలా ప్రోత్సహించడానికి ఏఐ + కియోస్క్ ద్వారా త్వరగా ఆరోగ్య పరీక్షలు చేసుకునే అవకాశాన్ని కల్పించడం ద్వారా నివారణ ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ భాగస్వామ్యం సాధ్యం కావడానికి సహకరించినందుకు ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్, స్టేషన్ సిబ్బంది, భాగస్వాములందరికీ శ్రావణి హాస్పిటల్స్ కృతజ్ఞతలు తెలిపింది. “ప్రతి రోజూ వేలాది మంది ఈ స్టేషన్ నుంచి ప్రయాణిస్తున్నందున శ్రావణి హాస్పిటల్స్ పేరు వారికి సంరక్షణ, దయ, శ్రేయస్సు పట్ల నిబద్ధతలను గుర్తుచేస్తుందని మేం ఆశిస్తున్నాం” అని నవీన్ చెట్టుపల్లి పేర్కొన్నారు.
