Tuesday, October 28, 2025
ePaper
Homeతెలంగాణ13 కిలోమీటర్లు.. 13 నిమిషాలు

13 కిలోమీటర్లు.. 13 నిమిషాలు

  • గుండె తరలింపునకు మెట్రో సంస్థ గ్రీన్‌కారిడార్‌

గుండె ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సర్జరీ కోసం చేపట్టిన ప్రక్రియలో హైదరాబాద్‌ మెట్రో కీలక పాత్ర పోషించింది. నగరంలోని ఎల్‌బీనగర్‌లో ఉన్న కామినేని ఆస్పత్రి నుంచి దాత గుండెను లక్డీకపూల్‌లో ఉన్న గ్లెనిగేల్స్‌ గ్లోబల్‌ ఆస్పత్రికి అత్యంత వేగంగా తరలించారు. దీని కోసం హైదరాబాద్‌ మెట్రో సంస్థ గ్రీన్‌కారిడార్‌ను ఏర్పాటు చేసింది. ఎటువంటి ఆటంకాలు, ఆలస్యం లేకుండా.. అతివేగంగా దాత గుండెను ట్రాన్స్‌పోర్ట్‌ చేసింది. గ్రీన్‌ కారిడార్‌ ద్వారా సుమారు 13 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 13 నిమిషాల్లోనే చేరుకున్నారు. ఈ రూట్లో 13 స్టేషన్లు దాటేశారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ రద్దీ మరీ ఎక్కువగా ఉంటుంది. గుండె తరలింపులో ఆలస్యం కావొద్దు అన్న ఉద్దేశంతో మెట్రో రైలులో దాన్ని పంపింపారు. జనవరి 17వ తేదీన రాత్రి 9.30 నిమిషాల సమయంలో మెట్రో రైలు ద్వారా డోనార్‌ గుండెను తరలించారు. చాలా సునిశితమైన ప్లానింగ్‌, మెట్రో రైలు.. వైద్యులు, ఆస్పత్రి వర్గాల సహకారంతో ఆ ప్రయత్నం సఫలమైనట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News