Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeబిజినెస్మెర్క్యూరీ ఈవీ టెక్‌కి "ముషక్ ఈవీ" తయారీకి అనుమతి

మెర్క్యూరీ ఈవీ టెక్‌కి “ముషక్ ఈవీ” తయారీకి అనుమతి

  • ముషక్ ఈవీ ‘మెక్ ఇన్ ఇండియా’ వాహనం
  • తక్కువ ఖర్చుతో, పర్యావరణహిత ఈవీలు తయారీ చేయనున్న మెర్క్యూరీ సంస్థ

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ మెర్క్యూరీ ఈవీ టెక్ లిమిటెడ్‌కి, బ్యాటరీతో నడిచే ఫోర్ వీలర్ గూడ్స్ వాహనం “ముషక్ ఈవీ” తయారీకి అధికారిక అనుమతి లభించింది. ఇది పూర్తిగా భారతదేశంలో తయారైన ‘మెక్ ఇన్ ఇండియా’ వాహనం. ఈ ముషక్ ఈవీ బాడీ బాగా మన్నికగా, కఠిన పరిస్థితుల్లోనూ సురక్షితంగా, నమ్మకంగా పనిచేసేలా తయారు చేశారు. ఈ వాహనం ప్రభుత్వ పథకాలకి అర్హత పొందింది. రాబోయే సబ్సిడీలు పొందేందుకు ఇది అర్హత గల ప్రాజెక్టు కావడంతో కంపెనీకి ఇది ఒక పెద్ద అవకాశంగా మారింది. మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని తీసుకువచ్చిన ఈ వాహనం, వ్యాపార విస్తరణకి దారితీస్తుందని మెర్క్యూరీ భావిస్తోంది.

ఇటీవల గుజరాత్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (జిసిసిఐ) మరియు కోరియా స్మార్ట్ ఈ-మొబిలిటీ అసోసియేషన్‌తో కలిసి నిర్వహించిన సాంకేతిక సమావేశంలో, మెర్క్యూరీ ఈవీ టెక్ సంస్థ కూడా పాల్గొంది. సమావేశంలో మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జయేష్ ఠాకర్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ దర్శన్ షా హాజరయ్యారు. అలాగే మెర్క్యూరీ కంపెనీ భవనగర్‌లో కొత్త షోరూం ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. మెర్క్యూరీ సంస్థ దేశవ్యాప్తంగా చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి, ప్రజలకు అందుబాటులో, తక్కువ ఖర్చుతో, పర్యావరణహిత ఈవీలు అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News