జూబ్లీహిల్స్ ఉపఎన్నికల (JubileeHills Bye Election) ప్రచారంలో భాగంగా డిప్యూటీ సీఎం (Deputy CM) భట్టి విక్రమార్క.. మంత్రి Komatireddy Venkat Reddyతో కలిసి తెలుగు క్లబ్(Telugu Club)లో సినీ ప్రముఖులు, సినీ కార్మిక నాయకులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వరల్డ్ క్లాస్ ఫిలిం సిటీ (World Class Film City) ఏర్పాటు చేసే ఆలోచనలో ఉందని తెలిపారు. సినీ పరిశ్రమకు నాడు, నేడు మేలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని (Congress Government) తెలిపారు. చెన్నై (Chennai) నుంచి సినీ రంగాన్ని హైదరాబాద్(Hyderabad)కు రప్పించి, స్టూడియోలకు భూములు ఇచ్చి అభివృద్ధికి దోహదం చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని వివరించారు. ఫిలిం క్లబ్, చిత్రపురి కాలనీ ఏర్పాటు ఇలా ఎన్నో.. సినీ పరిశ్రమకు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం వెంటనే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో అన్ని భాషల వారూ కలసి ఎదుగుతున్నారని, భవిష్యత్తులో చిన్న, పెద్ద సినిమాలు ఎక్కువగా రావాలని ఆకాంక్షించారు. సినీ రంగం ఎదిగితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈ ప్రభుత్వం బలంగా ఉంటేనే సినీ పరిశ్రమ బలపడుతుందని వివరించారు.
