తెలంగాణ ప్రభుత్వ (Telangana Government) పెద్దలు, తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) ప్రముఖులు ఇవాళ ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (AICC) ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్(KC Venugopal)తో భేటీ అయ్యారు. తెలంగాణలో సంఘటన్ సృజన్ అభియాన్ (Sangathan Srijan Abhiyan) పురోగతి, జిల్లా కాంగ్రెస్ కమిటీ(DCC)లకు కొత్త అధ్యక్షుల నియామకంపై చర్చించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti), టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తదితరులు పాల్గొన్నారు.

