Thursday, February 26, 2026
Homeవరంగల్‌Mee Seva | ఏజన్సీ ఏరియా "పల్లె" ల్లో కానరాని "మీసేవ" సెంటర్లు!

Mee Seva | ఏజన్సీ ఏరియా “పల్లె” ల్లో కానరాని “మీసేవ” సెంటర్లు!

  • ‘జిల్లా అంతటా మండల కేంద్రాలకి పరిమితమైన మీ సేవ సెంటర్లు…
  • మహాజాతర “మేడారం” పరిసర ప్రాంతాల్లో మచ్చుకైనా లేని “మీ సేవా”, ఆన్లైన్ కేంద్రo
  • సర్టిఫికెట్ల కోసం పనులు మాని తిరుగుతున్న ప్రజలు
  • ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త “మీసేవ” సెంటర్లు మంజూరు చేయాలని కోరుతున్న ప్రజలు, నిరుద్యోగులు

ములుగుజిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల్లోని పల్లె ప్రజలు తామకు అవసరమైన వివిధ రకాల సర్టిఫికెట్లు, ప్రభుత్వ పథకాలు, సర్వీసులు పొందేందుకు పనులు మాని మండల కేంద్రానికి వెళ్తే తప్ప ప్రజలకు “మీసేవ” సర్వీసులు అందడం లేదు. ములుగుజిల్లా కేంద్రం మొదలుకొని, ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, వెంకటాపురం, గోవిందరవుపేట,వాజేడు, కన్నాయిగూడెం తదితర మండలంలో ఉన్న నాలుగు,అయిదు “మీసేవ” సెంటర్లు మండల కేంద్రానికి మాత్రమే పరిమితం అవడంతో పల్లెల్లో “మీ సేవ” సెంటర్లు లేకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రైతులు విద్యార్థులు, సాధారణ పౌరులు, వివిధ శాఖల అధికారులకు వారికి కావలసిన సర్టిఫికెట్లు పొందేందుకు మండల కేంద్రానికి పరుగు తీయాల్సి వస్తుంది. మంగపేట,ములుగు, వెంకటాపురం మండలంలో ఒక్కో మండలంలో మొత్తం 25 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రజల అవసరాలకు సరిపడా మీసేవ సెంటర్లు అందుబాటులో లేవని మరీ ముఖ్యంగా పల్లెల్లో “మీ సేవ “సర్వీసులు దూరం అయ్యాయని, సంబంధిత రెవిన్యూ, జిల్లా కలెక్టర్ ను ప్రజల అవసరాలకు అనుగుణంగా అవసరం ఉన్నచోట “మీ సేవ” సెంటర్లు మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

అలాగే ఉన్నచోటనే అయిదు, పది మీ సేవా సెంటర్లను అనుమతి ఇవ్వకుండా పెద్ద సెంటర్ ఉన్న పల్లెల్లో ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన దేశంలో రెండో కుంభమేళా గిరిజన జాతర గా పేరొందిన మేడారం గ్రామ పరిసరాల్లో “మీసేవ ” సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తున్న.

ప్రజల అవసరాలకు తగినట్టుగా “మీసేవ” సెంటర్లు ఏర్పాటు చేయలేక పోతున్నారని ఆయా రెవిన్యూ శాఖ అలసత్వం పై ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా మంగపేట మండలంలో అత్యధిక జనాభా కలిగిన మేజర్ పంచాయతీలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ జనాభా కి అనుగుణంగా “మీ సేవ” సెంటర్లు అందుబాటులో లేవు. పల్లె ప్రాంతాల్లో “మీసేవ” సెంటర్ల అనుమతులు పొంది మండల కేంద్రంలో “మీసేవ” సెంటర్లు నడుపుతూ ఉండడంతో, కొత్త “మీసేవ” సెంటర్లు భర్తీ చేయడం అధికారులకు, తలనొప్పిగా మారింది. మండలంలో కొన్ని “మీసేవ” సెంటర్లు మంజూరైన వాటిని నడవక పోవడంతో అవి నిరువయోగంగా మారాయి.

ఎంతోమంది నిరుద్యోగ యువత, నైపుణ్యం కలిగి డిగ్రీలు, పీజీ లు పూర్తిచేసి, సొంతగా, నిలబడి ఏదైనా ప్రజలకు పనికొచ్చే పని చేయాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. అటువంటి వారి కోసం జనాభా ప్రాతిపదికన అర్హత ఉన్న ప్రాంతాల్లో “మీ సేవ” సెంటర్లు మంజూరు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే విధంగా మండల రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యే, ఐటీ శాఖ మంత్రి, ఐటీ కమిషనర్ వెంటనే చర్యలు తీసుకుని అర్హత ,అవకాశం ఉన్న ప్రాంతాల్లో “మీసేవ” సెంటర్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే విధంగా “మీసేవ” సెంటర్ల ను భర్తీ చేయాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోంది.

మండలంలో ఉన్న 25 పంచాయతీలకు కేవలం 5 “మీసేవ” సెంటర్లు ఎలా సరిపోతాయని ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రజలు పనులు మానుకొని ఉన్న అయిదు “మీసేవ ” సెంటర్లు చుట్టే తిరిగిన సర్టిఫికెట్లు సకాలంలో చేతికి రాక వారి పని డబ్బులు శ్రమ వృధా అవుతుంది తప్ప సెంటర్లో సర్వీసులు అందుబాటులోకి రావడం లేదని ప్రజలు విసుగు చెందుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా నిరుద్యోగ యువత మీసేవ సెంటర్లు కావాలని ఎన్ని దరఖాస్తులు కలెక్టర్ ఆఫీసులో రెవెన్యూ కార్యాలయంలో సమర్పించిన వాటి ఏర్పాటుకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్త పరుస్తున్నారు.

ఇదిలా ఉంటే మరో పక్క తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో భాగంగా ప్రజలకు ప్రభుత్వ సర్వీసులు పథకాలను సులభంగా అందించాలనే లక్ష్యానికి అనుగుణంగా అవసరం ఉన్న మేర “మీసేవ” సెంటర్లకు అనుమతులు మంజూరు చేసి, జిల్లా కలెక్టర్ ద్వారా వెంటనే “మీసేవ” సెంటర్లను ఖాళీలను భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News