Friday, October 3, 2025
ePaper
Homeతెలంగాణప్ర‌హారీ లేని వ‌స‌తి గృహం

ప్ర‌హారీ లేని వ‌స‌తి గృహం

  • అనంతగిరిలో వైద్య విద్యార్థులకు రక్షణ కరువు..!
  • కనీసం ప్రహరీ గోడ ఏర్పాటు చేయలేని స్థితిలో అధికారులు
  • అనంతగిరిలో చిరుత సంచారం వార్తతో భయం భయంగా గడుపుతున్న విద్యార్థులు
  • జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక చొరవ తీసుకోవాలంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు

వికారాబాద్‌ జిల్లా కేంద్రం లోని అనంతగిరి అడవి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ మెడికల్‌ కళాశాల వసతి గృహం సమస్యల సుడిగుండంలో చిక్కు కుంది.అనంతగిరికి వేలాదిమంది పర్యాటకులు వస్తుంటారు అయితే పర్యాటకుల ముసుగులో ఆకతాయిలు అసాంఘిక కార్య కలాపాలకు అడ్డాగా పేరుగాంచిన అనంతగిరి అడవి ప్రాం తంలోని టీబి హాస్పిటల్‌ భవనంలో నూతన ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను ప్రభుత్వం ప్రారంభించింది. అక్కడే ఉన్న మరో పాత భవనానికి మరమ్మత్తులు చేసి మెడికల్‌ విద్యార్థినిలకు వసతి గృహంగా మార్చారు.కానీ వసతి గృహానికి కనీసం సీసీ కెమెరాలు ప్రహరీ గోడ లేకపోవడంతో విద్యార్థినిలు ఉండే వసతి గృహం పక్కనే ఆకతాయిలు మద్యం తాగుతూ నానా హంగామ సృష్టించే అవకాశం లేకపోలేదు.రాష్ట్రం నలుమూలల నుండి వికారాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు భయం గుప్పెట్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఉన్న వసతిగృహం 100 మీటర్ల దూరంలోనే హత్యలు జరిగిన ఘటనలు కూడా గతంలో అనేకం వెలుగు చూశాయి. అయితే పక్కన ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణం కొనసాగుతుంది.అయితే అందులో పనిచేసే కూలీలు అక్కడే ఉంటూ పనులు చేసుకుంటున్నారు. కావున కనీసం వసతిగృహానికి ప్రహరీ గోడ ఉంటే రక్షణగా ఉంటుంది కానీ అధికారుల నిర్లక్ష్యానికి జరగరానిది జరిగితే బాధ్యులు ఎవరు అవుతారు అని పలువురు వాపోతున్నారు. జరగరానిది జరిగిన తర్వాత బాధపడే కంటే ముందే వసతి గృహానికి ప్రహరీ గోడ నిర్మించి విద్యార్థినిలకు ఇబ్బంది లేకుండా అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా తీర్చిదిద్దాలని, పోలీసు నిఘా సైతం పెంచాల్సిన అవసరం ఉందంటున్నారు.

చిరుత పులి సంచారంతో భయం భయం…
గత వారం రోజులగా అనంతగిరి అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తుందని సోషల్‌ మీడియాలో వీడియోలు వైరల్‌ కావడంతో ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు. అడవిలో ఏర్పాటుచేసిన వైద్య కళాశాల వసతి గృహానికి ప్రహరీ గోడ లేకపోవడంతో భయం భయంగా గడపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి కనీసం తాత్కాలిక ప్రహరీ గోడ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News