Sunday, March 1, 2026
Homeహైదరాబాద్‌Secunderabad MLA | పేదల వైద్య సేవలకు ప్రాముఖ్యత

Secunderabad MLA | పేదల వైద్య సేవలకు ప్రాముఖ్యత

  • పద్మారావు గౌడ్

సితఫలమండీ లో ని కుట్టి వెల్లోడి ప్రభుత్వ సివిల్ ఆసుపత్రి నిర్మాణం పనులను స్థానిక శాసనసభ్యులు,మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ శనివారం పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గంలో పేదలకు మంచి వైద్య సేవలను అందించేందుకు కృషి చేస్తున్నామని,ఈ క్రమంలో స్థానికంగా పేరొందిన కుట్టి వెల్లోడి ప్రభుత్వ ఆసుపత్రికి కొత్త భవన సముదాయాన్నినిర్మించే పనులు వేగంగా చేపతున్నామని తెలిపారు.

అదే విధంగా లాలాపేట లో రూ.13.05 కోట్లు, అడ్డగుట్ట లో రూ.13.05 కోట్ల ఖర్చుతో కొత్త ఆసుపత్రి భవనాల నిర్మాణం పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు.పనుల్లో నాణ్యతను పాటించాలని,సూపర్ స్పెషాలిటి సేవలు అందించేలా ఏర్పాట్లు జరపాలని అధికారులను ఆదేశించారు.బీ.ఆర్.ఎస్. సమన్వయకర్త రాజ సుందర్,నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News