Tuesday, February 10, 2026
Homeవరంగల్‌Medaram | సీఎం రేవంత్ చేతుల మీదుగా మేడారం పునఃప్రారంభం

Medaram | సీఎం రేవంత్ చేతుల మీదుగా మేడారం పునఃప్రారంభం

ఆదివాసీల అతిపెద్ద పండుగ(Adivasi Festival) అయిన మేడారం సమ్మక్క-సారలమ్మ(Sammakka Saaralamma) పుణ్యక్షేత్రం(Temple) పునరుద్ధరణ పూర్తయిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth) ప్రజలకు అంకితం చేశారు. ఈ చారిత్రాత్మక ఘట్టంలో సీఎం కుటుంబ సమేతంగా సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లను దర్శించుకొని ఆశీర్వాదం పొందారు. దాదాపు వెయ్యేళ్ల వీరగాథకు, జాతి వారసత్వ సంపదకు సంబంధించిన చరిత్రకు అద్దం పట్టేలా రూపుదిద్దుకున్న మేడారం గద్దెలను, ఆలయ ప్రాంగణాన్ని పునఃప్రారంభించిన(Restarted) అనంతరం సీఎం ప్రత్యేక పూజలు(Special Puja) నిర్వహించారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రివర్గ సహచరులు, ప్రజాప్రతినిధులతో కలిసి అమ్మవార్లను దర్శించుకున్నారు. అంతకుముందు గద్దెల ప్రాంగణంలో పైలాన్‌ను సీఎం రేవంత్ ఆవిష్కరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News