Tuesday, February 10, 2026
Homeమెదక్‌Medak Mp | ఎంపీ ప్రశ్నలకు కేంద్రం సమాధానం

Medak Mp | ఎంపీ ప్రశ్నలకు కేంద్రం సమాధానం

లోక్‌సభలో మెదక్ ఎంపీ (Medak Mp) రఘునందన్ రావు (Raghunandan Rao) అడిగిన ప్రశ్నలకు కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి (Union Minister of State for Commerce) పంకజ్ చౌదరి (Pankaj Chaudhary) సమాధానం చెప్పారు. తెలంగాణలో సహకార రంగ బ్యాంకుల పటిష్టత కోసం కేంద్రం నాబార్డ్(Nabard), నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(Ncdc) ద్వారా చేపడుతున్న చర్యలను వివరించారు. ఎన్సీడీసీ ద్వారా తెలంగాణ కోపరేటివ్ బ్యాంక్‌కి రూ.2 వేల కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. తెలంగాణలో సహకార సారథి ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మినిస్ట్రీ ఆఫ్ కోపరేషన్, నాబార్డ్ ద్వారా డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇతర వసతుల మెరుగుదల కోసం కృషి చేస్తున్నామని వెల్లడించారు.

ఎన్‌పీఏ మొండి బకాయిలు 10 శాతం కన్నా ఎక్కువ ఉంటే టైం బౌండ్ యాక్షన్ ప్లాన్ ద్వారా ఆర్బీఐ, నాబార్డ్ పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. 100 కోట్ల కన్నా తక్కువ డిపాజిట్లు ఉన్న అర్బన్ కోపరేటివ్ బ్యాంక్‌లకు బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏర్పాటుచేయాలని చెప్పారు. తెలంగాణలో గ్రామీణ సహకార బ్యాంకులో మొత్తం 445 బ్రాంచీలతో రూ.1,65,64 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని చెప్పారు. అర్బన్ కోపరేటివ్ బ్యాంకులో 35 బ్రాంచ్‌ల్లో రూ.10,198 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News