కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ప్రధానమంత్రి ఉజ్వల యోజన(PMUY) కింద మంజూరైన ఉచిత గ్యాస్ సిలిండర్ల(Free Gas Cylinders)ను మెదక్ ఎంపీ రఘునందన్ రావు(Raghunandan Rao) ఆదివారం పంపిణీ(Distribution) చేశారు. ఈ కార్యక్రమం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉజ్వల యోజన ద్వారా పేద కుటుంబాలకు స్వచ్ఛమైన వంట గ్యాస్ అందడంతో మహిళల ఆరోగ్యం(Women’s Health) మెరుగుపడుతోందని చెప్పారు. కట్టెల పొగ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు తగ్గుతున్నాయని తెలిపారు. ప్రధాని మోదీ(PM Modi) నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ అనేక పథకాలను అమలు చేస్తోందని అన్నారు.

