Tuesday, February 10, 2026
Homeమెదక్‌Charminar Zone | మెదక్ జిల్లాను చార్మినార్ జోన్ లో కలపాలి

Charminar Zone | మెదక్ జిల్లాను చార్మినార్ జోన్ లో కలపాలి

  • ఎంఆర్వో సహదేవ్ కు మండల ప్రజల వినతి

మెదక్ జిల్లాను చార్మినార్ జోన్ లో కలపాలని డిమాండ్ చేస్తూ చిలిపిచేడ్ మండల ప్రజలు మండల ఎంఆర్వో సహదేవ్ కు,ఎంపీడీఓ ప్రశాంత్ కు వినతిపత్రం సమర్పించారు.రాజధాని హైదరాబాద్ ఆనుకొని ఉన్న జిల్లాను తీసుకెళ్లి రాజన్న సిరిసిల్ల జోన్ లో కలిపేయడంతో తీవ్రంగా నష్టపోతున్నామని మండల ప్రజలు వాపోతున్నారు.విద్య,ఉద్యోగ,ప్రమోషన్ల విషయంలో తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మొన్నటి దాకా బీఆర్ఎస్ ప్రభుత్వం తమ డిమాండు తొక్కిపెట్టిందని,కాంగ్రెస్ ప్రభుత్వమైనా స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ సునీల్ చౌహన్,వ్యవసాయ అధికారి రాజశేఖర్ గౌడ్,కార్యదర్శి కృష్ణ,కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు పాండరి,రామకిష్టయ్య,లింగాగౌడ్,కొండల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News